బందరులో ఆడటం నేర్చుకున్న తొలి తరం బాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు-జమ్మలమడుగు పిచ్చయ్య-మచిలీపట్నం

1
3536

జమ్మలమడుగు పిచ్చయ్య ( జననం: డిసెంబరు 21, 1918 ) తొలి తరం బాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు.ఈ క్రీడలో గెలుచుకున్న తొలి అర్జున అవార్డు గ్రహీత ఇతనే.ఈయన 1918, డిసెంబరు 21న కృష్జా జిల్లాలోని కూచిపుడి గ్రామంలో జన్మించాడు.

క్రీడా ప్రస్థానం
ఈయన పదోతరగతి తప్పడంతో ధ్యాసంతా క్రీడలపై మళ్ళింది. ఈ క్రమంలో బందరు పట్టణంలో మినర్వ క్లబ్‌, మోహన్‌ క్లబ్‌లలో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడడం నేర్చుకున్నాడు.1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచాడు.1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. 1950 దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ క్రీడల్లో పాల్గొనలేకపోయాడు కాని 1954-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 1956, 1957 సంవత్సరంలో మద్రాస్‌, పాండిచ్చేరి రాష్ట్రాలలో జరిగిన జాతీయ పోటీల్లో జట్టు కెప్టెన్‌గా వహించి గెలుపొందారు, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వహించి 9 ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించాడు.

పురస్కారాలు
భారత బాల్ బాడ్మింటన్‌ క్రీడా రంగానికి ఇతను చేసిన సేవలకు 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. కాని 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా ఆ సంవత్సరంలో ఈ అవార్డును అందుకోలేకపోయాడు. 1972లో అప్పటి భారత రాష్ట్రపతి ఐన వి.వి గిరి గారి చేతుల మీదుగా దిల్లీలో ఈ అవార్డును స్వీకరించాడు.

1 COMMENT

  1. జమ్మలమడుగు పిచ్చయ్య కాదు జమ్మలమడక పిచ్చయ్య

Leave a Reply