రాగల 48 గంటలపాటు కోస్తాంధ్ర,రాయలసీమకు వర్షసూచన..

0
579

విపత్తుల నిర్వహణ శాఖ
🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨
ఐఎండి వాతావరణ సూచన

🌨 దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో బలపడి ఆ తదుపరి 48గంటల్లో (నాలుగు రోజులు) వాయుగుండంగా మారే అవకాశం

🌨 కోస్తాంధ్ర , రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

🌨 కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

🌨 సముద్రం అలజడిగా ఉంటుంది.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు:- విపత్తుల శాఖ కమిషనర్

☀️ రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం

☀️ వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలి :-విపత్తుల శాఖ కమిషనర్

⛈️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి:-విపత్తుల శాఖ కమిషనర్

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల శాఖ కమిషనర్

Leave a Reply