Typist To Trend Setter..Rajakumari Garu

0
913

ఆమె ఆత్మ విశ్వాసంతో ఉన్నతస్థాయికి చేరారు. బీకాం ఫెయిలైనా.. టైపిస్టు నుంచి డివ్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు రాజకుమారి. ఆమె ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌ ఈడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నా మరో ఆడపిల్లను పెంచుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృషి చేస్తే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని నిరూపిస్తున్న రాజకుమారి.రాజకుమారి స్వస్థలం బందరులోని ముస్తాఖాన్‌పేట. ఆమె తండ్రి మాజీ సైనికుడు. తల్లి బందరు మునిసిపల్‌ పాఠశాలలో టీచరు. తండ్రి వద్ద క్రమశిక్షణ, తల్లి వద్ద వినయ విధేయతలు నేర్చుకున్నారు. ఆమె తన తల్లి రహేలమ్మనే గురువు, దైవంగా భావించి ఎదిగారు.రాంజీ ప్రభుత్వ హైస్కూల్లో టెన్త్ చదివిన ఆమె లేడీయాంప్తిల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ వరకు అభ్యసించారు. ఇంటర్‌ చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకురాలిగా ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించేవారు.ఆ తర్వాత నోబుల్‌ కళాశాలలో బీకాం చదివారు. బీకాం తప్పినా పట్టుదలతో ముందుకుసాగారు.1988లో ఆమెకు వివాహమైంది. పెళ్లయిన వారానికే సర్వీస్ కమిషన్‌ పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఆరునెలల్లోనే టైపిస్ట్ ఉద్యోగం పొందారు. తొలుత మచిలీపట్నం తహసీల్తార్‌ కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత అవనిగడ్డ, పమిడిముక్కల, కలెక్టర్‌ కార్యాలయం, ఆర్లీవో కార్యాలయాల్లో టైపిస్టుగా చేశారు.2000లో తహసీల్తార్‌గా పదోన్నతి పొందారు.బంటుమిల్లి, తోట్లవల్లూరు, గూడూరు, పమిడిముక్కల తహసీల్తార్‌గా పని చేశారు. ఆ సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు, దరఖాస్తు చేనిన ఒక్కరోజులోనే కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన సందర్భాలున్నాయి.కలెక్టరేట్‌లో బి సెక్షన్‌ నూపరింటెండెంట్‌, నూజివీడు ఆర్డీవో కార్యాలయంలో సైళ్ల పనులు చకచకా చూసేవారు. ఆడపిల్లల విద్యాభివృద్ధికి కృషిచేశారు.సిబ్బందిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.పేదింటి ఆడపిల్లల విద్యకు సహకరిస్తున్నారు. పేద ఆడపిల్లలకు పుస్తకాలు అందజేయడం, ఫీజులు కడుతూ వారి విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటునందిస్తున్నారు. ఆమె టైపులో హైస్పీడ్‌ పరీక్ష పాసయ్యారు. అదే వేగంతో ఫైళ్లను నడిపిస్తుంటారు.ఉద్యోగిగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.సీనియారిటీపై 2018లో ముడా కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. పోర్టు భూసేకరణకు ఆమె కృషి చేశారు. పోర్టు నిర్మాణంతో తాను జన్మించిన బందరు అభివృద్ధి చెందుతుందని ఆమె విశ్వాసం. రాజకుమారి పలు సందర్భాల్లో ఉత్తమ సేవలందించినందుకు అవార్డులు తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం , రిపబ్లిక్‌ డే సందర్భంగా కలెక్టర్‌ నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Leave a Reply