కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావం సాధారణ జనంపైనే కాకుండా…తిరుమల శ్రీవారిపై కూడా కూడా పడింది. దేశంలోనే ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల కూడా ఒక్కటి. కరోనా ప్రభావం స్వామి వారి ఆదాయానికి భారీగా గండిపడింది. ఇప్పటికే నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో తిరుమలకు భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు లేక నిర్మానుష్యంగా తిరువీదులు మారిపోయాయి. కాటేజీలు, షాపులు మూతపడ్డాయి. సాధారణంగా ఈ కాలానికి తిరుమలకు రూ.250 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని ఒక అంచనా. హుండీ లో భక్తులు వేసే కానుకలు, కాటేజీల అద్దెలు తదితర రూపాలలో ఈ ఆదాయం వస్తుంటుంది. ఇప్పుడు ఆదాయానికి గండిపడింది. కరోనా ఎఫెక్ట్ సాధారణ పబ్లిక్‌తో పాటు..దేవుడికి తప్పడం లేదు.
