బందరు డివిజన్ పరిధిలో కరోనా ప్రాజిటీవ్ కేసులు అదుపులో ఉన్నాయని ఆర్డీవో ఖాజావలి పేర్కొన్నారు.
మోపిదేవి మండలంలోని టిటిడి కళ్యాణ మండపం లో ఆర్డిఓ ఖాజ వలి అధ్యక్షతన covid 19 పై, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ ఖాజావలి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అంతేకాకుండా కౌలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మోపిదేవి మండలం లో ఇప్పటివరకు 85 పాజిటివ్ కేసులు ఉండగా అందులో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. 38 మంది డిఛార్జి కగా 45 మంది వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తాసిల్దార్ లతీఫ్ పాషా,ఎస్. ఐ పి.సురేష్, ఈవోపీఆర్డీ అరుణకుమారి, వ్యవసాయ అధికారిని వి. శివ నాగ రాణి, గ్రామ పంచాయతీ సెక్రెటరీలు పి.మాదవేంద్రరావు,కే. త్రిపుర సుందరి, పి.రామకోటేశ్వరరావు, సుజాత, వీఆర్వోలు సచివాలయం నర్సులు, మహిళా పోలీసులు సచివాలయం సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు