లాక్ డౌన్ 3.0 ముగింపు గడువు దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది.
ఇవాళ్టి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొన నున్నట్లు సమాచారం.
గత సమావేశంలో కేవలం ప్రధాని, హోం మంత్రి మాత్రమే పాల్గొన్నారు.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదో సారి.
మరో వైపు అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్ లు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో ఇవాళ ఉదయం కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ మాట్లాడారు.
ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల రాకతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వారు ఈ భేటీ లో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో ఆయా జిల్లాలు రెడ్ జోన్లు గా మారుతున్నాయని చెప్పినట్లు తెలిసింది.
ఇలాగైతే సాధారణ స్థితికి చేరు కోవడం కష్టమే నన్న భావన వారి నుంచి వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
దీంతో ఇదే అంశం రేపటి ముఖ్యమంత్రులతో సమావేశం లోనూ చర్చకు రానుంది.
దీంతో పాటు లాక్ డౌన్ అమలు విధానం, తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావన కు రానున్నాయి.
గత సమావేశంలో కేవలం 9 మంది ముఖ్యమంత్రులకే మాట్లాడే అవకాశం ఇవ్వగా.. ఈ సారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడ నున్నారు
