NTSE,NMMS Exams…

0
382

నేషనల్‌ టాలెంటో సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ ఎంఎంఎస్‌) పరీక్షలువచ్చే నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు.ఎన్‌టీఎస్‌ పరీక్ష ఉదయం 9 .౩౦ నుంచి 11 .30 గంటల వరకు,మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందన్నారు.పరీక్ష నిమిత్తం మచిలీపట్నంలో 28 కేంద్రాలు ఏర్పాటు చేశామనీ, ఈ పరీక్షలకు మొత్తం 6,114 మంది హాజరువుతున్నారన్నారు. ఎన్‌ ఎంఎంఎస్‌ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వ హిస్తామన్నారు. పరీక్ష నిర్వహణకువిజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు తదితర ప్రాంతాల్లో మొత్తం 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని మొత్తం 5,418 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.

Leave a Reply