భారత్, చైనా సరిహద్దు వద్దకు మోడీ భారత్, చైనాల సరిహద్దు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. లడఖ్ లో ఆకస్మిక పర్యటన చేస్తున్న ప్రధాని కాసేపటి క్రితం లేహ్ చేరుకున్నారు. ఆయన టాప్ కమాండర్లతో భేటీ కానున్నారని.. LAC వద్ద తాజా పరిస్థితిని CDS జనరల్ బిపిన్ రావత్ కలిసి సమీక్షిస్తారని సమాచారం. అటు చైనా దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించనున్నారట. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
