అర్హులైన పేదప్రజలందరికీ ఇళ్ల స్థలాలు

0
927

అర్హులైన పేదప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయం వద్ద పలువురు ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. తొలుత ఎన్ . గొల్లపాలెంకు చెందిన కొందరు గ్రామస్తులు తమ పేర్లను ఇళ్లస్థలాల తుది జాబితా నుండి ఉద్దేశ్యపూర్వకంగా తొలగించివేశారని మంత్రి పేర్ని నానికి పిర్యాదు చేశారు. .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వంత స్థలాలు ఉన్నవారికి మరల స్థలం ఏవిధంగా వస్తుందని గ్రామస్తులను అడిగారు. అర్హులను అనర్హులుగా స్థానిక వి ఆర్వో ఒకవేళ చూపిస్తే , ఆ ఉద్యోగి కొలువుకే ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు. ఇళ్లస్థలం విషయంలో ఏదైనా రిమార్క్ రాస్తే , ఆ విషయంను విచారణ సమయంలో ఆ మాటకే కట్టుబడి నిర్దారణ చేస్తూ ఊరందరి ముందు మైక్ లో సైతం దైర్యంగా చెప్పగలిగే స్థాయిలో వి ఆర్వో లు నిక్కచ్చిగా ఉండాలని గతంలోనే కలెక్టర్ , ఆర్డీవో హెచ్చరించారని ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ అధికారి పొరబాటు చేసే అవకాశముండదనీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ . గొల్లపాలెం గ్రామనికి చెందిన గొరిపర్తి వెంకట నరసమ్మ పేరిట 3 సెంట్ల స్థలంలో గల ఇంటిలో లబ్దిదారురాలు తన కుమారునితో కలిసి ఉంటున్నారని వీరికి ఇంకా 6 సెంట్ల భూమి ఉందని రాసినట్లు ఉందని తెలిపారు, అలాగే , దేవనబోయిన ప్రశాంతి గ్రామంలో నివాసముండటం లేదని , కుక్కల సాంబశివరావు, గొరిపర్తి లక్ష్మికు , గొరిపర్తి వీరమ్మకు స్వంత ఇళ్ళు ఉన్నాయని , దొడ్డు ఝాన్సీ కు హోమ్ గార్డ్ ఉద్యోగం ఉందని , డొక్కు రమాదేవికి 3 సెంట్ల స్వంత స్థలం ఉండటమేకాక 7 సెంట్ల స్థలం ఆమెకు ఉందని , గొరిపర్తి రాఘవమ్మకు కొడుకులకు కలిపి 15 సెంట్ల స్థలం ఉందని, దొడ్డు మంగమ్మకు స్వంత స్థలం ఉందని తెలిపారు . మీకు ఇంకా సందేహం ఉంటే, ఆర్ ఐ , వి ఆర్వో ను పిలిపించి మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తామని మంత్రి వారికీ చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ళస్థలాలు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం’ కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినవారికి ఆగస్ట్ 14న ఇళ్లు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టనున్నారని చెప్పారు . హౌసింగ్ స్కీం కోసం మొత్తం 42,920 భూములు అవసరం అవుతున్నాయిని చెప్పారు. 25,842 ఎకరాలు ప్రభుత్వ, 16,078 ఎకరాలు ప్రైవేటు భూములు వినియోగించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లే ఔట్స్ సిద్ధంచేశారు. రాష్ట్రంలో 2023 నాటికి 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని జగన్ యోచిస్తున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, సకాలంలో 11 వ పి ఆర్ సి ని అమలు చేయాలనీ కోరుతూ, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు చెందిన అధ్యక్షులు షేక్ సాబ్జీ , పీ బాబురెడ్డి , తోట రఘుకాంత్ (చిన్నా ) తదితర ఉపాధ్యాయులు మంత్రి పేర్ని నాని కలిసి ఒక వినతి పత్రాన్ని అందచేశారు.తన కుమారుడు మాడపాటి సురేష్ కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కొరకు బదిరుల కోటాలో దరఖాస్తు చేసుకొన్నట్లు ఆ ఉద్యోగం దయచేసి తన కుమారునికి ఇప్పించాలని అభ్యర్థిస్తూ బాస్కరపురానికి చెందిన మాడపాటి రాధాకృష్ణ మంత్రి పేర్ని నానిను కోరారు.

మేకావానిపాలెం హమాలీ కాలనీకు చెందిన వీరంకి మాధవరావు తన కుమారునికి యాక్సిడెంట్ జరిగిందని , ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్ధిక సహాయం చేయాలని మంత్రి పేర్ని నానికి మొర పెట్టుకొన్నారు.చల్లపల్లి రోడ్డుకు దిగువున ఉన్న రైతులమని మల్లవోలు నుంచి గుండుపాలెం వరకు తమకు కొత్తిమెరకోడు పంటకాలువ ప్రవహిస్తుందని ఆ కాలువను ఆనుకొని ఒక మురుగు బోదె ను కొందరు నీరు చెట్టు పథకం కింద కట్ట పగలకొట్టి తవ్వెరని దీంతో పంట కాలువలో నీరు మురుగు బోదె లోనికి వెళ్లిపోతుందని కొత్తిమెరకోడు కాలువ దిగువకు 3 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని మంత్రి పేర్ని నానికు వేమూరి గోపాలకృష్ణ , తూమాటి పున్నయ్య , మొవ్వ వెంకయ్య , ఘంటా సత్యనారాయణ తదితర రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Leave a Reply