రేపటి నుంచి ఉచిత రేషన్‌ బియ్యం, శనగలు పంపిణీ..

0
577

లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది పనులు కోల్పోవడంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి నాలుగో విడత ఉచిత రేషన్‌ను అం దించనుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ద్వారా ఒక్కో కార్డుకు కిలో శనగలు, ప్రతి సభ్యుడికి ఐదు కిలోలు బియ్యం అందజేస్తారు. అర కేజీ పంచదారను మాత్రం సబ్సి డీ ధరపై సరఫరా చేస్తారు. పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 12,59,936 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు చౌక డిపోల ద్వారా సరుకులు అందించనున్నారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతి కార్డుదారునికి గ్రామ/వార్డు వలంటీర్లు వీటిని అందజేస్తారు.

కూపన్‌లో సూచించిన తేదీలో నిర్ధేశించిన సమయానికి వెళితే బయోమె ట్రిక్‌ ద్వారా డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. మాస్కులు వేసుకుని భౌతిక దూరం పాటించి రేషన్‌ సరుకులు తీసుకో వాలని వలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు.

Leave a Reply