మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి…DGP

0
762

నిస్సహాయులకు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్… అటువంటి పోలీసుల నుంచి సామాన్యులకు మెరుగైన సేవలు అందాలి.. అది అందాలంటే పోలీసుల పనితీరులో నాణ్యత పెరగాలి.. నేరాలు తగ్గాలంటే శిక్షలు పెరగాలి…నింధితులు తప్పించుకోకుండా ఉండాలంటే తగిన ఆధారాలు సమర్పించాలి…. మహిళలు ధైర్యంగా బయటకి రావాలంటే ఆకతాయిల మొదలుకొని మృగళ్ళ వరకు అదుపు చేయాలంటే అందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే… మహిళలు చిన్నారులు సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి… వీటన్నింటిని పూర్తి స్థాయిలో అమలుపరచడం లో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ డిజిపి గా బాధ్యతలు చేపట్టిన గౌతంసవాంగ్ IPS ప్రధానమైన అంశాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ట్రాన్స్ఫెర్స్, రిఫోర్మ్స్, సర్వీస్, టెక్నాలజీ వినియోగం వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షలు నిర్వహించి కసరత్తు చేసినా అనతరం ఒక్కొకటిగా చక్కబెడుతూ వస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందక పోవడం వెనుక ప్రధాన కారణం పోలీసులకు తగిన విశ్రాంతి లేకపోవడమే అని గుర్తించారు. అంతే కాకుండా సిబ్బంది కుటుంబానికి దూరమవుతున్న అనే మానసిక ఒత్తిడికి లోనౌతున్న అంశాన్ని గుర్తించారు. దినికరణంగా బాధితులకు పూర్తిస్థాయిలో సేవ చేయలేకపోతున్నారని,వారికి తగినంత విశ్రాంతి కల్పించినట్లు అయితే వారి నుండి ఎనిమిది గంటలపాటు నాణ్యమైన సేవలను పొందవచ్చు అనే నిర్ణయానికి వచ్చిన డి‌జి‌పి.అందుకు తగట్టుగా సీనియర్ ఐపీఎస్ ల తో చేర్చించి మొత్తం 18 రకాల ఆప్షన్లుతో సిబ్బంది కొరత లేకుండా వీక్లీ ఆఫ్ అందరికి అందేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగ సమూలమైన మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.దిని ఫలితంగా పోలీసుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది, అదేప్రణాళికతో పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాంభించిన స్పందన కార్యక్రమాన్ని పోలీస్ శాఖలో ప్రవేశపెట్టారు. రాష్ట్రలోని ప్రతి జిల్లా ఎస్‌పి కార్యలయంలో ప్రతి సోమవారం స్పందనకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దిని ద్వారా ప్రతిఒక్కరు నేరుగా జిల్లాల ఎస్పీలను కలసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ భాదితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ వారికి ఫిర్యాదు పట్ల బారోసా కల్పిస్తున్నారు.దీనితో పోలీస్ శాఖ లో ట్రాన్స్పరెన్సీ ,అక్కౌంటబిలిటీ పెరిగింది.
అనంతరం డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా దిశ, మహిళల కోసం ప్రత్యేక నెంబర్లు, అప్లికేషన్లు, ఫోన్ రాగానే స్పందించడం, అర్బన్ ప్రాంతాల్లో ఐదు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మహిళల ను జాగృతం చేసేందుకు మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తు, ఎన్జీవోలతో కార్యక్రమాలు, మహిళ మిత్రులు, నిస్సహాయులు చిన్నారుల కోసం ఆపరేషన్ కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తుడడం ద్వారా రేపటి పౌరులు జీవితాల్లో వెలుగులు నిండాయి. మహిళలకు లభించిన భరోసా సాధారణ విషయం కాదు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి 21 రోజుల్లో విచారణ ఎదుర్కొని శిక్షకు గురయ్యాడు. ఇలాంటివి ఎన్నో కేసులలో శిక్షలు పడుతున్నాయి, టెక్నాలజీ విషయంలో సాధించింది ఏంటని అడిగితే దేశవ్యాప్తంగా 20 అవార్డ్స్, కేసుల పరిష్కార 88 శాతంగా ఉన్నాయి. గత ఏడాది వరకు 78 శాతానికి మించలేదు. శిక్షలు 53 శాతం నుంచి 64 పెరిగాయి, ఎనిమిదిన్నర లక్షల మంది నేరస్తుల పై పోలీస్ టెక్నాలజీ నిరంతరం నిఘా ఉంది, తప్పిపోయిన ఏడు వేల మందిని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం, మూడున్నర వేల వీడియో ఫుటేజీ కోర్టులో అందజేసి శిక్షల శాతం పెంచడం, ఒకప్పుడు అధికారులతో డిజిపి టెలీ కాన్ఫరెన్స్ అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఫిర్యాది దారులతో నేరుగా డి‌జి‌పి మాట్లాడుతున్నారు.టెక్నాలజి ద్వారా 960 మంది అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ ను పోలీసులు అరెస్టు చేయగలిగారు. శ్రీ గౌతం సవాంగ్ గారు చేప్ట్టిన ఈ మార్పులు కరోనా లాక్డౌన్ లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చిన పోలీసులు రాత్రింబవళ్ళు చేసిన డ్యూటీలు, తబ్లిగిలను గుర్తించడం నుంచి 22 వేల మంది విదేశీ ప్రయాణికులను లాక్ డౌన్ లో ఉంచడం, చివరికి సేవాభావంతో సొంత జీతాలు కూడా ఇస్తూ డబ్భై రెండు రోజులు కుటుంబాలను త్యాగం చేశారు. పోలీస్ బాస్ గా ఎప్పటికప్పుడు పోలీస్ కుటుంబాలతో మాట్లాడటం, బహిరంగ లేఖ రాయడం, వారిలో మనో ధైర్యాన్ని నింపడం లాంటి వాటితో కేసుల సంఖ్య పెరగకుండా చూడగాలిగాం.
ఇటీవల కొత్తగా ఏర్పాటు SEB చేసిన రాష్ట్రంలోని నదుల్లో సంపదను బయటకి రాకుండా అడ్డుకుంటుంది. బయటనుంచి నాన్ డ్యూటీ లిక్కర్ లోపలికి రాకుండా కట్టడి చేస్తుంది. వేలాది మంది పై కేసులు, అంతే మొత్తంలో వాహనాలు స్వాధీనం, లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం లాంటి చర్యలతో అక్రమార్కులు తోకముచ్చుతున్నారు. డి‌జి‌పి పర్యవేక్షణలో SEB పనిచేయడం ప్రారంభమైన నాటి నుంచి అడ్డుకుంటున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
మొత్తం మీద ఈ ఏడాది కాలంలో డిజిపి పర్యవేక్షణలో జరిగిన పని తీరును గమనిస్తే అతి సామాన్యుడు కూడా తనకు న్యాయం కోసం ప్రతి జిల్లా ఎస్పీ వద్దకు వెళ్ళవచ్చు, పని భారం అనే మాటకు తావులేకుండా పోలీసులు కుటుంబ సభ్యులతో గడపవచ్చు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం మహిళలు మొబైల్ లో ఉండే తిరగవచ్చు టెక్నాలజీ శిక్షల శాతం పెరుగుదలతో నేరస్తులు తప్పడం లేదు కేసుల పరిష్కారంలో దేశంలోనే రెండో స్థానంలో కి తీసుకువచ్చి దేశంలో పోలీసు ప్రతిష్టను గౌతమ్ సవాంగ్ ఐపిఎస్.
*విజయవంతంగా స్పందన కార్యక్రమం.*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున పేదలు తరలివస్తున్నారు. అధికారులు సైతం అప్యాయంగా పలుకరించి, వారి సమస్యలను సావధానంగా విని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. జిల్లా ఎస్పీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పోలీస్ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమం జనసంద్రాన్ని తలపిస్తుంది. వివిధ ఫిర్యాదుల పై వచ్చే వారికోసం కార్యక్రమం వద్ద ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్ తగాదాలు, వేదింపులు, అదృశ్యం ఫిర్యాదులు తోపాటు ఎక్కువగా, ఇంటి స్థలాల, పింఛను, రేషన్‌ కార్డుల కోసం స్పందన కార్యక్రమాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్నారు.
స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా జిల్లా ఎస్పీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.అంతే కాకుండా స్పందన ద్వారా వస్తున్న ఫిర్యాదులపై పోలీస్ అధికారులు వేగంగా చర్యలు తీసుకోవడం తో పాటు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు.పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలపై అర్జీలు ఇచ్చిన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ జిల్లాల వారీగా నిర్వహించిన స్పందన కార్యక్రమం ,ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు,పరిష్కరించిన ఫిర్యాదుల పూర్తి వివరాలు..
స్పందన ద్వారా అందిన పిటిషన్ లు 75610 .మొత్తం అందిన పిటిషన్ లో 16403 ఎఫ్.ఐ.అర్ లు చేసాము అంటే అందిన పిటిషన్ లలో 22% .ఎఫ్.ఐ.అర్ లు నమోదు చేసిన వాటిలో 58804 కేసులను పరిష్కరించము.అంటే 77% శాతం బాధితులకు న్యాయం చేసాము. ఇంకా 403 ఎఫ్.ఐ.అర్ లు అంటే 1% శాతం పెండింగ్ లో ఉన్నాయి.

*దిశ యాప్*

రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) స్వల్ప వ్యవధి లోనే ఐదు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
మహిళల కు రక్షణగా , తోడు నీడగా,అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ దిశా యాప్ సేవలను అందిస్తుంది. దిశ కేసు దర్యాప్తు లో అత్యంత కీలకమైన ఎఫ్.ఎస్.ఎల్ ల్యాబ్ లను ఆధునిక టెక్నాలజీ తో అప్‌గ్రేడేషన్ చేయడంతోపాటు, అంతే కాకుండా దిశ కేసుల విచరణ కోసం ప్రతి జిల్లా స్థాయి లో ప్రత్యేకoగా టీం లను ఏర్పాటు చేసాము.

* కేసు దర్యాప్తు కోసం ఖచ్చితమైన సమయం తోపాటు నిర్ణీత సమయంలో ట్రైల్ పూర్తి జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ దిశ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో పూర్తిస్థాయి లో దిశ కేసుల కోసం ఒక ప్రత్యేక స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేశాము.

* దిశ యాప్ ప్రత్యేకతలు*

* ప్రజలకు అందుబాటులో అత్యవసర సహాయం (మహిళలకు & సీనియర్ సిటిజన్స్).
* SOS ద్వారా నేరుగా పోలీసులకు సమాచారం.
* దిశ యాప్ లోకి వెళ్లకుండా నేరుగా SOS ద్వారా కంట్రోల్ రూం కి సమాచారం.
* నేరుగా బాధితుల ఉన్న ప్రదేశం తో పాటు పది సెకండ్ల వీడియో కంట్రోల్ రూం కి చేరే విధంగా ఏర్పాట్లు స్మార్ట్ మొబైల్ ఫోన్ లలో ఇది అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు.
* మరికొన్ని వివరాలు..సమీపంలోని పోలీస్ స్టేషన్ ల వివరాలు, స్థానిక పోలీస్ స్టేషన్ మరియు సురక్షిత ప్రాంతాల వివరాలు, పోలీస్ డైరీ, అత్య అవసర నంబర్ లు, సోషల్ మీడియా, రోడ్ సేఫ్టీ.
* దిశ అప్లికేషన్ మరియు SOS పూర్తి స్థాయి పరియవేక్షణ కోసం అత్యంత ఆధునిక టెక్నాలజీతో పోలీస్ కేంద్ర కార్యలయం లోని సాంకేతిక భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.దీనిని DIG టెక్నికల్ సర్వీసెస్ పాలరాజు IPS నిరంతరం మానిటర్ చేస్తారు.

Disha Application downloads
Test calls
Actionable Calls
TOTAL NO. FIRs

4,00,000
42,799
336
82

ఆంధ్ర ప్రదేశ్ లో అమలౌతున్న జీరో ఎఫ్.ఐ.అర్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ హత్యకేసుతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్‌లలో పరిధితో సంబంధం లేకుండా
ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసే విధంగా అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేంజ్ ల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల పరిధిలో జీరో ఎఫ్.ఐ.అర్ ను అమలు చేస్తున్నారు.

ఎవరైనా కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు, వారిని వెనుకకు పంపుతున్న విధానానికి పూర్తిగా స్వస్తి పలికాము. బాధితుడు పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 274 జీరో ఎఫ్.ఐ.అర్ లు నమోదు చేసాము.
2019 FIRs(2019)
FIRs(2020)
Total

62
212
274

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం. నిరంతర నిఘా కోసం డ్రోన్‌ల నుండి ప్రత్యక్ష ప్రసారం .అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. ప్రజల కోసం సురక్ష, స్పందన మరియు దిశా మొబైల్ అప్లికేషన్స్, పోలీస్ సిబ్బంది కోసం APCOPS మొబైల్ పోలీస్ అప్లికేషన్ (e-Hunt. Frs. క్రైమ్ అనలిటిక్స్, PIS, కోర్టు క్యాలండర్). పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు)

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు సాధించిన సత్ఫలితాలు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అత్యంత వేగంగా 88% కేసుల దర్యాప్తును పూర్తి చేసాము.నేరస్థులు నేరం నుండి తప్పించు కోకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేర నిరూపణ చేసాము. 2017లో 49.3%, 2018లో 53.8% కాగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా 2019లో 58.1% నేరస్థులకు శిక్ష పదేవిధంగా కేసు దర్యాప్తు చేసాము. పోలీసుల నుండి వివిధ కేసులలో తప్పించుకు తిరుగుతున్న 1600 మంది నేరస్థులో 960 మందిని గుర్తించాం. అదే విధంగా 11235 మిస్సింగ్ కేసులో 7373 మంది గుర్తించాము..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా మూడు రోజుల్లోనే పాస్ పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నాము. వారం రోజుల్లో స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, డయల్ 100 వస్తున్న ఫిర్యాదుల పై ఐదు నిమిషాలలో సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నము.

కరోనా పై యుద్ధం లో పోలీసు శాఖ పాత్ర :

ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్, రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ అనితరమైన సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. పగలనక, రేయనక, ఎండనక, వాననక, ప్రజారోగ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహోరాత్రం శ్రమిస్తూ తమ ప్రాణాలు సైతం లెక్కించక, విధులను నిర్వహిస్తున్న70,000 మంది పోలీస్ సిబ్బంది,58,000 మంది హోం గార్డ్ ల సిబ్బంది యొక్క త్యాగం అజరామరం. ఈ రోజు కోవిడ్ నియంత్రణ లో భారత దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలబడిందంటే, దానికి పోలీసు సిబ్బంది తో పాటు మిగతా ఫ్రంట్ వారియర్స్ యొక్క త్యాగాలు కారణమని చెప్పక తప్పదు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ గత రెండున్నర నెలలుగా శ్రమించడం అమోఘం. ఈ క్రమం లో 45 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. అయినా సరే మొక్కవోని ధైర్యం తో విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పై యుద్ధంలో పోలీసు సిబ్బంది అంకిత భావంతో పని చేయడం లో వారి కుటుంబ సభ్యుల సహకారమూ లేకపోలేదు. ఆపద పొంచి ఉన్నదని తెలిసినప్పటికీ, పోలీసు సిబ్బందిని కరోనా సమరానికి సమాయత్తం చేస్తూ వారికి వీర తిలకం దిద్ది తమ కుటుంబ సభ్యులే పంపించిన ఘట్టం అభినందనీయం. వారి త్యాగ నిరతిని ప్రశంసిస్తూ డీజీపీ గారు స్వయానా లేఖ రాయడం, మీ సంక్షేమం కోసం నేనున్నానంటూ భరోసా ఇవ్వడం, అది తన ప్రధమ కర్తవ్యం గా భావించడం స్పూర్తికి నిదర్శనం. ఒక క్రొత్త సమస్య… దానిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు… అయినప్పటికీ, వైరస్ బారిన పడకుండా చాకచక్యంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన డీజీపీ ఒక పక్కా ప్రణాళిక తో ముందుకు కదిలారు. ముందుగా తమ సిబ్బంది లో జవ సత్వాలు నింపి, ప్రాణాలను సైతం లెక్కించక నిరంతరం విధులు నిర్వర్తించే విధంగా వారిలో స్ఫూర్తిని నింపారు. మరోపక్క పోలీస్ సిబ్బంది వ్యక్తిగత రక్షణకు వారికి కావల్సిన మాస్క్ లు, హాండ్ గ్లౌజ్ లు, శానిటైజర్లు అందిస్తూ, అత్యంత ప్రమాదకరమైన రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారికి నాణ్యతతో కూడిన PPE కిట్లను అందిస్తూ నూతనోత్సాహాన్ని నింపారు. 55 ఏళ్ల వయస్సు పైబడిన వారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచారు, మరో పక్క , రోగనిరోధకశక్తిని పెంపొందించే క్రమంలో విటమిన్ మాత్రలు (బీకోజిన్క్ మున్నగు మాత్రలు), పౌష్టికాహారం మరియూ హోమియో పిల్స్ ను ఎప్పటికప్పుడు సమకూర్చారు. ఈ క్రతువులో ప్రభుత్వం తో పాటు ఎందరో మానవతా వాదులు , స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖకు బాసటగా నిలిచి, వివిధ రూపాలలో సహాయ సహకారాలు అందించడం అభినంధనియం. విశ్వ మానవతా సంస్థ సహకారంతో పోలీసు సిబ్బంది మరియూ వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టి లో ఉంచుకుని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆన్లైన్ కౌన్సెలింగ్ మరియూ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇవ్వడం చేశారు. పోలీసు సిబ్బంది విధులలో ఉన్న దృష్ట్యా, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు మరియూ అత్యవసర సేవల కల్పనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఫామిలీ వెల్ఫేర్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని వేలాది మంది పోలీసు కుటుంబాలు ఉపయోగించు కొన్నారు. అదే విధంగా, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు దృష్టి లో పెట్టుకొని, హెల్త్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆరోగ్య భద్రత లో లభ్యమైన డేటా మరియూ హెల్త్ సర్వే డేటా ఆధారంగా, హృదయ, మూత్ర పిండ, దీర్ఘ కాలిక శ్వాస కోశ సంబందిత వ్యాధులు, డయాబెటిస్ మున్నగు సమస్యలు ఉన్న వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. అందులో తీవ్రత ఉన్నవారిని ఎంపిక చేసి, అట్టి వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ , వారిని ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ వ్యాధి బారిన పడకుండా కాపాడటం జరిగింది. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్ సిబ్బందికి కరోన వైరస్ లక్షణాలు బయటపడంతో డి‌జి‌పి గారు ఎప్పటికప్పుడు అట్టి వ్యక్తుల చికిత్స గురించి వాకబు చేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచి, మెరుగైన వైద్య సేవలను అందించడం వల్ల కోవిడ్ బారిన పడ్డ పోలీసు సిబ్బంది అందరూ ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ రహిత శాఖగా పోలీస్ డిపార్ట్మెంట్. కరోనా సోకిన విషయాన్ని ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో హిందూపురం కి చెందిన ASI హాబీబూల్లాను పోలీస్ శాఖ కోల్పోవడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడా లేని విధంగా, గౌరవ ముఖ్యమంత్రి గారు హాబీబుల్లా కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం అందించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. వారిచ్చిన ధైర్యం మరియ స్పూర్తితో రెట్టింపు త్సాహంతో ప్రజా సేవ లో అంకిత మవుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.

Covid Related Work :

జనవరి 3వ వారంలో మొదటిసారిగా వుహాన్ ,చైనా నుండి విద్యార్డులు ఆంధ్ర ప్రదేశ్ కు తిరిగి వచ్చినప్పటి నుండి కోవిడ్ పై పోరాటాన్ని ప్రాంభించము.మొత్తం 22,266 మంది NRI రిటర్న్స్ ను గుర్తించి, వారి ప్రైమరీ & సెకండ్రి కాంటాక్ట్స్ వారిని క్వారెంటయిన్ లో ఉంచాము.
గుంటూరు కు చెందిన వ్యక్తి డిల్లీలో జరిగిన తబ్లిఘ్ జమాత్ కు వెళ్ళి వచ్చిన ద్వారా కరోన వ్యాప్తి చెందినట్లు గుర్తించాము.అనoతరం 1167 కేసులను గుర్తించాము.వీరి యొక్క 4798 ప్రైమరీ కాంటాక్ట్స్, 8008 సెకండ్రి కాంటాక్ట్స్ గుర్తించి మొత్తం 13822 మందిని క్వారెంటయిన్ లో ఉంచాము .

House quarantine APP

దేశ వ్యాప్తంగా మొదటిసారిగా హోం క్వారంటైన్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ కు చెందుతుంది .మొదటి విడతగా అప్లికేషన్ లో నమోదు చేసుకున్న 21,390 మంది NRI రిటర్న్స్ కు నిరంతరం మోనిటర్ చేయడం తో పాటు… 2,838 నిభందనలను అతిక్రమించినట్లు గా గుర్తించాము.

కోవిడ్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు :

• రాష్ట్రం సరిహద్దులను పూర్తిగా మూసివేశామ్.
• ప్రజలలో కోవిడ్ పై తీసుకోవాల్సిన జాగ్రత్రలపై సోషల్ మీడియా (facebook,Twitter, whatsapp & YouTube)వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించాము.
• కోవిడ్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పశువులకు పశుగ్రాసాన్నిఅందించాము.
• వలస కార్మికులకోసం పోలీస్ శాఖ 686 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాము.
• ప్రతి ఒక్కరికీ మాస్క్ లు అందించడం, అత్యవసర వస్తువుల కోసం బయటకు వచ్చే ప్రజలు రైతు బజార్లు , మార్కెట్లు , మెడికల్ షాప్లు, ఎటిఎం సెంటర్ ల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకున్నాము.
కరోనా పై పోరాటంలో తమవంతు స్వచ్చంధంగా ఆర్ధిక సహాయాన్ని అందించిన పలువురు పోలీస్ శాఖకు చెందిన సిబ్బందిని గౌరవ డిజీపీ గారు అభినందించారు

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)
రాష్ట్రంలో ఇసుక మరియు మద్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపే దిశగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక రవాణా మరియు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది.గత నెల 16వ తేది నుండి ఇప్పటివరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) నిర్వహించిన రైడ్స్ వివరాలు :

SEB on Sand from 16.05.2020 to 03.06.2020
Name Of the District
Number Of Cases Booked
Number Of Persons Accused
Vehicles seized
Quantity of Sand seized (Tonnes)

TOTAL
757
1442
1062
351705.85

SEB on Enforcement of Liquor From 16.05.2020 to 03.06.2020
Name Of The District
Number Of Cases Booked
Number Of Persons Arrested
Number Of Vehicles Seized
Black Jaggery Seized(kgs)
NDPL Seized(litres)
Fermented Jaggery Destroyed(Litres)

Total
6,673
8,789
2,247
32,429
24,463
6,49,890

పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం పలు సంస్కరణలు

* దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత బీమా పథకం.
* యాక్సిస్ బ్యాంక్ ఖాతాలు ద్వారా ఉచిత బీమా (కానిస్టేబుళ్లకు 40 లక్షలు & హోమ్ గార్డ్లకు 30 లక్షలు)
మానిటరీ సౌకర్యం , పోలీస్ & హోమ్ గార్డ్స్ లకు సహజ మరణాలు పై బీమా , పదవీ విరమణ తర్వాత కూడా సహజ మరణం చెందితే 1.5 లక్షలు బీమా, ప్రభుత్వ నిబంధనప్రకారం వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉన్న హోం గార్డులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు. అదే విధంగా పోలీస్ శాఖ లోని హోంగార్డ్ స్థాయి నుండి ప్రతి ఒక్క పోలీస్ కు క్రమం తప్పకుండా మెరుగైన ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ లు ఏర్పాట్లు చేయటం జరిగింది.

ఆరోగ్య భద్రత- 2019

ఈ సంవత్సరము ఆరోగ్య భద్రత ద్వారా మొత్తం 15,128 పోలీస్ కుటుంబాలకు నగదు రహిత చికిత్సను అందించడం జరిగింది. అందుకు గాను పోలీస్ శాఖ మొత్తం 41.59 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది.
మహిళ పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మహిళ మిత్ర యాప్.
ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు మహిళ పోలీస్ అధికారినిలను మహిళ మిత్ర కో – ఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. అంతే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎనిమిది మంది మహిళా పోలీసులతో మహిళ మిత్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి వారంలో చివరి రోజు గ్రామాలలో వాలంటీర్స్ తో కలసి పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ము.మహిళల పై జరుగుతున్న నేరాల నియంత్రణకు చర్యలు.మహిళల పై ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నా వారిని అరికట్టేందుకు మహిళల మఫ్టీబీట్స్ ఏర్పాటు చేసాము.

CID WING :
• CRDA లో జరిగిన అక్రమాలను వెలికితీసి ఏడు కేసులు నమోదు చేయడంతో పాటు బినామీలను గుర్తించడం జరిగింది.ప్రస్తుతం కేసు దర్యాప్తు లో ఉంది.
• అగ్రిగోల్డ్ భాదితులకు మొదట విడతలో 10,000 లోపు డిపాజిట్లు ఉన్నవారికి 263.99 కోట్ల రూపాయలను అందజేశాము.
• తప్పుడు వార్తల నిరోధించేందుకు S4 Whatsapp హెల్ప్ లైన్ 9071666667 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాము.
• సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు 161 సి‌ఆర్‌పి‌సి స్టేట్మెంట్ రికార్డింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పరికరాన్ని వినియోగిస్తున్నాము.
• EOW, సైబర్ క్రైమ్ & పి‌సి‌ఆర్ సెల్ పై మూడోవ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహణ.
• మాదకద్రవ్యాల నియంత్రణ కోసం 24గంటల పాటు అందుబాటులో whatsapp 7382296118 నెంబర్ .
• ఎన్‌ఆర్‌ఐ ల పెట్టుబడులకు 24 గంటలపాటు వాటిని సంరక్షిచెందుకు ప్రత్యేకంగా విభాగం పనిచేస్తుంది.

కోవిడ్ రహిత పోలీస్ శాఖ
కొరోనా నియంత్రణలో భాగంగా ఒక పక్క విధులు నిర్వహిస్తూనే మరొక పక్క పోలీసు సంక్షేమంపై పూర్తి శ్రద్ధ వహించడంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సఫలీకృతమైంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ శాఖ లో అనేక మంది సిబ్బంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.అంతే కాకుండా వేలమంది వ్యాధి బారిన పడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 44 మంది బారిన పడి త్వరగా కోలుకున్నారు. ప్రాథమిక దశలో గుర్తించక పోవడంతో హిందూపురం కు చెందిన ఏ‌ఎస్‌ఐ హాబీబుల్లా(55) ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply