కరోనాపై కొత్త ఆయుధం…

0
941

మాప్-1తో 3 నెలలు నో టెన్షన్…

కరోనా వైరస్ మనుషులు నిత్యం వినియోగించే వస్తువులపై కొన్ని గంటల పాటు జీవిస్తున్న సంగతి తెల్సిందే. దీంతో వస్తువులను శుభ్రంగా కడిగి వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, నిత్యం వినియోగించే వస్తువులను ఎల్లప్పుడూ కడిగి వాడడం కొందరికి సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వస్తువులపై ఒకసారి పిచికారీ చేస్తే, కరోనా వైరస్ ను వాటిపై చేరకుండా 90 రోజుల పాటు నిరోధించే సరికొత్త క్రిమి సంహారిణిని హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దానికి ‘మాప్-1’ అని నామకరణం చేశారు. ఈ క్రిమి సంహారిణిని తాము పదేళ్ల పాటు శ్రమించి తయారు చేశామని తెలిపారు. గత ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షల తరువాత అనుమతులు లభించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాఠశాలలు, మాల్స్, క్రీడా ప్రాంగణాలు, లోహ, ప్లాస్టిక్ ఉత్పత్తులు, వస్త్రాలు, కలప తదితరాలపై దీనిని పిచికారీ చేస్తే, మూడు నెలల పాటు వైరస్ లను, బ్యాక్టీరియాలను వాటి ఉపరితలంపై నిలువకుండా చూడవచ్చని తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్ లోకి తీసుకుని వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply