గుజరాత్ నుంచి మత్స్యకారులను 65 బస్సులలో ఆంధ్రప్రదేశ్ కు తరలింపు.

0
478
Mopidevi Venkata Ramana

రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్యశాఖల మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ -19 ప్రపంచమంతటిని చుట్టవేయడం…దేశంలో లాక్ డౌన్ అనౌన్స్ చేయడం,ఎక్కడివారక్కడ ఆగిపోవడం వల్ల బతుకుదెరువుకోసం దూరప్రాంతాలకు వెళ్లిన వ్యక్తులు వారి స్వస్ధలాలకు రావడానికి అనేక రకాలైన ఆటంకాలు ఎదురవుతున్నాయి.

గత 20రోజుల క్రితం మంగుళూరుపోర్టునుంచి మన రాష్ర్ట బోర్డర్ కు వచ్చిన షుమారు 1700 మందిని ఆయా జిల్లాలకు పంపించి, క్వారంటైన్ చేయించి, వైద్యపరమైన నిబంధనలను పాటించిన అనంతరం వారి స్వస్ధలాలకు పంపించాం.

అదేవిధంగా గుజరాత్ లోని వేరవల్ పోర్ట్ బహుశా భారతదేశంలోనే అతి పెద్ద ఫిషింగ్ యాక్టివిటి ఉన్నపోర్ట్.ఆ పోర్ట్ లో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం ప్రాంతాలనుంచి వెళ్లిన షుమారు 4 వేలమంది మత్స్యకారులు అక్కడ ఇరుక్కుపోయారు.

వారిని స్వస్ధలాలకు రప్పించడానికి చర్యలు తీసుకునేందుకు కొన్ని కారణాలవల్ల కాలయాపన జరిగింది.దురదృష్టవశాత్తు ఈలోపు ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి రెండు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రి,కేంద్ర హోంమంత్రిగారితో,నిర్మలాసీతారామన్ గారితో ఈ సమస్యపై మాట్లాడారు.

నాలుగువేలమంది రాష్ర్టం కాని రాష్ర్టంలో విపత్కరపరిస్దితులలో ఇబ్బందులు పడుతున్నారు.వారందర్ని స్వస్ధలాలకు రప్పించేందుకు అనేక విధాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది.

ప్రారంభంలో వారందర్ని సముద్రమార్గంలో తీసుకువద్దామనే నేను ఆలోచన చేశాను.కోస్ట్ గార్డు,ఇతర అధికారుల క్లియరెన్స్ కు ప్రయత్నం చేయడం,సముద్రమార్గంలో వారిని తీసుకురావడం, వారి ప్రాణాలకు సంబంధించి అంత శ్రేయస్కరం కాదనే ఆలోచనతో ఆ ప్రపోజల్ విరమించుకోవడం జరిగింది.

వారిని రోడ్డుమార్గంలో తీసుకువద్దామనే ఆలోచన చేశాం.ఈ క్రమంలోఅధికారికంగా అన్నిరకాల అనుమతులను తీసుకోవాల్సి వచ్చింది.ఎందుకంటే మూడు రాష్ర్టాలు గుజరాత్,మహారాష్ర్ట,తెలంగాణ దాటి రావాల్సిఉంది.అంతర్రాష్ర్టాలకు సంబంధించి నిబంధనలను అనుసరించి ప్రత్యేకమైన అనుమతులు తీసుకున్నాం.

ఈ క్రమంలో వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఎంతఖర్చైతే అంతఖర్చు మన రాష్ర్ట ప్రభుత్వం భరించేవిధంగా ముఖ్యమంత్రిగారు మూడు కోట్ల రూపాయలను సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండురోజులక్రితం మంజూరు చేశారు.దీంతో వారిని తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.

గుజరాత్ వేరవల్ పోర్టులో 4,052 మంది ఉంటే వారిలో 2,852మంది శ్రీకాకుళంజిల్లాకు చెందిన వారుండగా,636 మంది విజయనగరం ,304 మంది విశాఖపట్నం,21 మంది తూర్పుగోదావరి,24 మంది పశ్చిమగోదావరి,ఒకరు కృష్ణా జిల్లానుంచి ఉన్నారు.మొత్తం 3,838 మంది ఉన్నారు.

నిన్నటినుంచి మొత్తం 65 బస్సులలో తీసుకురావడానికి నిర్ణయించగా 54 బస్సులు స్టార్ట్ అయ్యాయి. మిగిలినవి స్టార్ట్ అవుతాయి.

వారందరూ కూడ రేపు సాయంత్రానికి ఏ జిల్లాకు చెందిన వ్యక్తులను ఆ జిల్లాకు పంపించడం జరుగుతుంది.ఇప్పుడున్న ప్రత్యేకపరిస్ధితులలో వారందర్నిక్వారంటైన్ నిబంధనలను అనుసరిస్తూ వైద్యపరమైన చర్యలు తీసుకుని పాజిటివ్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారణ అయ్యాక మాత్రమే వారిని స్వస్ధలాలకు పంపించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు,పోలీసు,వైద్య అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఏ ఒక్క వ్యక్తిని కూడా క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా వారి స్వస్ధలాలకు పంపించడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.గుజరాత్ కు సంబంధించి సమస్య ఈరోజుతో సాల్వ్ అయింది.

Leave a Reply