Account Takeover Crimes In And around Bandar–Becareful

0
542

బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి నిధులు మళ్ళించడం, క్రెడిట్‌ / డెబిట్‌ కార్డుల ద్వారా
చోరీలకు పాల్పడడం అక్కడక్కడా జరుగుతోంది. ఇంటర్‌నెట్‌ లావాదేవీల ద్వారా జరుగుతున్న నేరాల కట్టడికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ అక్కడక్కడా అమాయకులు మోసపోతున్నారు. ఇటీవల ఆధునిక
పద్ధతులలో ఎకౌంట్‌లు టేకోవర్‌ చేసి నేరాలకు పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపార లావాదేవీలు జరిపే ఇ-మెయిల్స్‌ను,ఫోన్ నెంబర్లను సేకరించి, మీకు లాటరీ వచ్చింది.. మీ బ్యాంక్‌ అకౌంట్‌ నెంబరు, మీ వివరాలు ఇవ్వండి మేము బ్యాంకు అధికారులం. బ్యాంకు ఖాతాలను తనికిలో చేస్తున్నాం. మీ అకౌంట్‌ నెంబరు, పొన్‌వర్డ్‌ ఇవ్వండంటూ రకరకాలమెసేజ్‌లతో వలవేస్తారు. లక్షలు,కోట్లు వచ్చాయని ఆశపడి ఎకౌంట్‌ నెంబర్లు ఇచ్చేఅమాయకులూ ఉన్నారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.అమాయకుల సొమ్మును కాజేస్తున్నారు.ఇలాంటివాళ్లతో జాగ్రత్తగా వుండండి.


Leave a Reply