7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం….

0
1002

మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై ఘనవిజయాన్ని సాధించింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా రెండో టీ20లో విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని మూడు వికెట్లు నష్టపోయి 17.3 ఓవర్లలలోనే ఛేదించింది. 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన నవదీప్ షైనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 పూణే వేదికగా జనవరి 10న జరగనుంది.

Leave a Reply