60 లక్షలు విలువ చేసే గుట్కాలు దగ్ధం….

0
714

డంపింగ్‌ యార్డు వద్ద బుధవారం రూ. 60 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కాలు,ఖైనీ ప్యాకెట్లను దగ్ధం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఉత్తర్వుల మేరకు వీటిని తగులబెట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పుడ్‌ కంట్రోలర్‌ ఎన్‌. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ… 2016 జూన్‌ 6, అక్షోబరు 1 2011,జూలై 1న మూడు కేసుల్లో జరిమానా రూ. 60 లక్షల నిషేదిత గుట్కాలు, ఖైనీలను దగ్గం చేశామన్నారు. ఇంకా మచిలీపట్నం, కంచికచర్ల, కైకలూరు తదితర ప్రాంతాల్లో రూ.50 లక్షల విలువ చేసే గుట్కాలు, ఖైనీలు స్వాధీనం చేసుకున్నామని,అయితే నిందితులు జరిమానాలుచెల్లించలేదన్నారు.. జరిమానాలు చెల్లించిన వెంటనే అధికారుల నమక్షంలో దగ్గం చేస్తామన్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు కింద వీరిపై కేసులు నమోదు చేని ఫైన్‌లు రికవరీ చేస్తామన్నారు. గుట్కాలు, ఖైనీల అమ్మేవారిపై చర్యలు తప్పవని, వీటిని అమ్మడం నేరమన్నారు.

Leave a Reply