వేంకటేశ్వర భక్త సంఘం 40వ వార్షికోత్సవం సందర్భంగా బచ్చుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు భక్త సంఘం కార్యదర్శి కె.లక్ష్మీనరనింహాచార్యులు తెలిపారు. బచ్చుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంఘం ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేనుకున్న సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎల్‌కేజి, యూకేజీ విద్యార్థులకు ప్రార్ధనా శ్లోకాలు. 1, 2 తరగతుల విద్యార్థులకు కృష్ణాష్టకం.3 ,4 తరగతుల విద్యార్థులకు మహాదేవస్తుతి, 5 ,6 తరగతుల విద్యార్థులకు ధ్యాన శోకాలు. 7 ,8 తరగతుల విద్యార్థులకు నవగ్రహ సోత్రాలు, 9 ,10 తరగతుల విద్యార్థులకు శివమానస పూజలపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వార్షికోత్సవాల సందర్భంగా విజేతలకు జనవరి 10న నిర్వహించే వార్షికోత్సవాల్లో బహుమతులు ఇస్తామన్నారు.జనవరి 11న స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్,ఉపాధ్యక్షులు ఎల్.ఎస్‌శాస్త్రి, కోశాధికారి 3. రామమోహనరావు
తదితరులు పాల్గొన్నారు.
