16 నుంచి టీటీడి ధార్మిక కార్యక్రమాలు…

0
659

తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి బందరులోని వివిధ దేవాలయాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పరిషత్‌ ప్రోగ్రాం అసిస్టెంట్‌ సి.ప్రసాద్‌ గురువారం తెలిపారు.16న రాజు పేట ముచ్చంగుడిలో అన్నమయ్య పాజెక్టు కళాకారులతో సంగీత కచేరీ హరికథ ఏర్పాటుచేశామన్నారు. 1/న గొడుగుపేట నాగేశ్వరస్వామి దేవాలయం, 18న గీతా మందిరం,18న బచ్చుపేట వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో అన్నమయ్య కీర్తనలు,హరికథలు ఏర్పాటు చేశామని తెలిపారు. ముచ్చంగుడిలో16న నుంచి 20 వరకు సంగీత కార్యక్రమాలు,ఉపన్యాసాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు.ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకుపాతృలు కావాలని కోరారు.


Leave a Reply