ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) వరకు పంపుకోవచ్చు….

0
551

ప్రస్తుతం ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) వరకు పంపుకోవచ్చు.

ఆపైన ఒక్కో ఎస్‌ఎంఎస్‌కు కనీసం 50 పైసల మేర ఛార్జీ విధించాలన్నది మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ నిబంధన.

అయితే తాజాగా ఆ నిబంధనను ట్రాయ్‌ తొలగించింది.

టెలీ మార్కెటింగ్‌, అవాంఛిత వాణిజ్య సమాచారాలకు అడ్డుకట్టవేసేందుకు అప్పట్లో ట్రాయ్‌ ఆ నిర్ణయం తీసుకుంది.

ఆ సమయంలో వాణిజ్యేతర వినియోగదార్లు భారీ సంఖ్యలో చేసే ఎస్‌ఎంఎస్‌లపై ఛార్జీలను విధించడానికి ఆపరేటర్లకు స్వేచ్ఛ ఉండేది.

అయితే నిజమైన వాణిజ్యేతర వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ నిబంధనను తొలగించింది.

ఆ మేరకు టెలికాం టారిఫ్‌ ఆదేశాలు-2012లోని ఆ ప్రత్యేక నిబంధనను తొలగిస్తూ సవరణ చేసింది.

ట్రాయ్‌ నిర్వహించిన తొలి దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా జరిగిన బహిరంగ చర్చ (ఓహెచ్‌డీ) అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక అవాంఛిత ఎస్‌ఎంఎస్‌ల విషయంలో 2018లోనే ఒక సరికొత్త, బలమైన సాంకేతికతతో ఒక వ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని ట్రాయ్‌ గుర్తు చేసింది.

Leave a Reply