హ్యాండ్‌ శానిటైజర్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంపు…

0
824

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినియోగదార్ల డిమాండ్‌ను ఎదు ర్కొనేందుకు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచుతున్నట్లు గతనెలలో యూనిలివర్‌ సంస్థ ప్రకటిం చింది. కోవిడ్‌ 19 వ్యాప్తి దృష్ట్యా తమ శానిటైజర్‌ ఉత్పత్తులకు మరిన్ని శ్రేణుల్ని జోడించడంతో పాటు ఉత్పత్తి సౌకర్యాన్ని, సామర్ద్యాన్ని పెంచుకుంటున్నట్లు గతనెలలోనే హిమాలయ డ్రగ్‌కంపెనీ స్పష్టం చేసింది. కరోనా భయం ఆవహించిన అనం తరం భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హ్యాండ్‌ శానిటైజర్ల విక్రయం అనూహ్యంగా పెరిగింది. 2019డిసెంబర్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్‌ తొలివారానికి శానిటైజర్ల విక్రయాలు 1700శాతం అధికంగా జరిగాయి. సూపర్‌మార్కెట్‌లు, ఔషద దుకాణాల్లోని శానిటైజర్లన్నీ ఖాళీ అయ్యాయి. అమెజాన్‌, ప్లిప్‌కార్డ్‌ వంటి ఆన్‌లైన్‌, ఈకామర్స్‌ సంస్థల వద్ద కూడా శానిటైజర్లు స్టాక్‌ లేదు. డిమాండ్‌ పెరగడంతో ఒక్కసారిగా శానిటైజర్ల ధరలు రెట్టిం పయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం దీర్ఘకా లంలో సరికాదంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇది మనిషి శరీరానికి పలురకాల కీడు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల క్రిములన్నీ చనిపోతాయన్న ధృవీకరణ ఇంతవరకు పూర్తిగాలేదు. కానీ రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల బ్యాక్టీరియా మాత్రం శానిటైజర్ల వినియోగం వల్ల చనిపోయే ప్రమాదముందని వీరు స్పష్టం చేస్తున్నారు. కరోనా భయం రానున్న కాలంలో కూడా కొన సాగనుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 2027నాటికి హ్యాండ్‌ శానిటైజర్‌ మార్కెట్‌ విలువను 2.14బిలియన్‌లకు పెంచుకోవాలని ఉత్పత్తిదార్లు పథకాలు సిద్దం చేశారు. ఇందుకనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. హ్యాండ్‌ శానిటైజర్‌ ఆల్కాహాల్‌ ఆధారిత, లేదా ఆల్కాహాల్‌ లేని ద్రవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడ్డానికి వినియోగిస్తారు. కరోనా నేపధ్యంలో చేతుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఇందుకు సబ్బును, నీటిని వాడాలని పేర్కొన్నారు. అయితే ఈ రెండు అందుబాటులో లేని సమయంలో హ్యాండ్‌ శానిటైజర్లు వినియోగించొచ్చని స్పష్టం చేశారు. కానీ సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా హ్యాండ్‌ శానిటైజర్‌ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ప్రజలంతా దీనివైపే మొగ్గుచూపుతున్నారు. చేతుల్ని క్రిముల్ని సంహరించేందుకు పాఠశాలలు, ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఆల్కాహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్స్‌ చేతిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడంలో మెరుగైన ఫలితాల్నిస్తుందని సంతృప్తి చెందుతున్నారు. అయితే 60నుంచి 95శాతం ఆల్కాహాల్‌ మిశ్రమం కలిగిన శానిటైజర్ల ు మాత్రమే ఈ విషయంలో తమ పనితనాన్ని చూపగలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో శానిటైజర్‌ ఉత్పాదక సంస్థలు హిమాలయ డ్రగ్‌ కంపెనీ, రెకిట్‌ బెంకిజర్‌, గోద్రేజ్‌, ఐటిసిలు ఈ తరహా శానిటైజర్ల ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నాయి.
అయితే యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజా నివేదికలో శానిటైజర్ల వాడకం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని తేల్చింది. పైగా వీటి వాడకం అధికమైతే చేతుల పై ఉండే శరీరానికి మేలు కలిగించే బ్యాక్టీరియాను ఇవి పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదాన్ని కూడా స్పష్టం చేసింది. శానిటైజర్‌ను చేతులపై జల్లగానే చల్లని, చక్కని అనుభూతి కలుగుతుంది. ఇది చేతులమీదుగా విస్తరిస్తుంది. దీంతో చేతులపైనున్న క్రిములన్నీ చనిపోయాయన్న భావన కలుగుతుంది. సబ్బు నీటితో చేతులు కడుక్కోవడానికిది సరైన ప్రత్యామ్నాయమేనన్న విశ్వాసం ఏర్పడుతుంది. పైగా సబ్బు, నీరు లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనిపై ఎక్కువ మక్కువేర్పడుతుంది. అన్నింటికి మించి ఎక్కడికిపడితే అక్కడకు తీసుకెళ్ళే అవకాశం కూడా దీనివైపు ప్రజలు ఆకర్షితులవడానికి కారణమౌతోంది. హ్యాండ్‌ శానిటైజర్‌లో ఇథైల్‌ ఆల్కాహాల్‌ వినియోగిస్తారు. ఇది క్రిమినాశినకారిగా పని చేస్తుంది. దీంతో పాటు సువాసననిచ్చే రసాయనాలు, గ్లిజరిన్‌ కూడా కలుపుతారు. ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్లన్నింటిలో రైక్లోసన్‌ లేదా ట్రైక్లోకార్బన్‌ అనే యాంటీబయాటిక్‌ సమ్మేళనం ఉంటుంది. వీటిని కొన్నిరకాల సబ్బులు, టూత్‌పేస్టుల్లో కూడా చూడొచ్చు. వీటితో తయారు చేసిన సబ్బుల్ని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబయల్‌ సబ్బులుగా పిలుస్తుంటారు. ఈ ట్రైక్లోసన్‌ అనవసర నష్టాల్ని కలిగిస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ ట్రైక్లోసన్‌ శరీరంపై యాంటీ బయాటిక్స్‌గా పని చేస్తుంది. చర్మంపైనున్న మొత్తం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. తద్వారా వ్యాధులను నిరోధించే బ్యాక్టీరియాను చేజేతులా చంపుకున్నట్లవుతుంది. ఇది నోరో వైరస్‌, గ్యాస్ట్రో ఇంటెరిటీస్‌కు కూడా కారణమౌతుందని ఎపెడమిక్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ అధ్యయనంలో కూడా తేలింది. బ్యాక్టీరియా నిరోధకతకు ఇది దారితీస్తుంది. తద్వారా భవిష్యత్‌లో కలిగే రోగాలకు చికిత్స చేయడం మరింత కష్టతరమౌతుంది. కొన్ని శానిటైజర్లలో ఇథైల్‌ ఆల్కాహాల్‌, ఐసోప్రొఫైల్‌ ఆల్కాహాల్‌లను విడివిడిగా లేదా రెండింటి మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. ఇ
ది చర్మంపైగల బ్యాక్టీరియాను విషపదార్ధం తరహాలో నిర్మూలిస్తుంది. పనిలోపనిగా చర్మంపైనున్న జీవకణాలు కూడా దీనివల్ల ప్రభావితమౌతాయి. ఇది యాంటీబయోటిక్‌ను ఎక్కువగా వినియోగిస్తే నిరోధక జాతుల్ని సృష్టించే ప్రమాదం కూడా ఉంది. శరీరంలోని హార్మోన్ల పనితీరును కూడా ఇది ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. శరీరాన్ని వ్యాధి నుంచి కాపాడే రోగనిరోధక వ్యవస్థను శానిటైజర్లు ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని మిచిగాన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల అలర్జీలు పెరిగే ప్రమాదాన్ని సూచించారు. ట్రైక్లోసాన్‌ అధికంగా ఉన్న శానిటైజర్లు వినియోగిస్తే తరచూ జ్వరం, ఇతర అలర్జీలకు గురయ్యే అవకాశమున్నట్లు స్పష్టం చేశారు. ఇక శానిటైజర్‌ సువాసనతో ఉంటే అందులో విషపూరిత రసాయనాలున్నట్లే. సింథటిక్‌ సుగంధాలు వెదజల్లే రసాయనాలు జననేంద్రియ అభివృద్దిని అడ్డుకునే ప్రమాదం కూడా ఉంది.
ఒక ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా భయంతో తరచూ చేతుల్ని కడుక్కోవాలి. అయితే ఇందుకు సబ్బు, నీటిని వినియోగించాలి. తప్పనిసరైతే శానిటైజర్లు వినియోగించినప్పటికీ అది పరిమితంగానే ఉండాలంటూ పేర్కొంటున్నారు.

Leave a Reply