ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా రామచంద్రరావు (96) కృష్ణా జిల్లా బందరులో 1922లో జన్మించిన రామచంద్రరావు మద్రాస్ లయోలా కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. 1968లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. హైదరాబాద్‌లో మరణించారు.
