యువజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో స్థానక హిందూ కళాశాల అడిటోరీయంలో నిర్వహించిన సాంస్పృతిక ప్రదర్శనలు ఆకట్కుకున్నాయి. ప్రిన్సిపాల్ మణిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.విద్యార్థులలో కళానైపుణ్యం వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ మేనేజర్ శ్రీనివాసరావు,ప్రముఖ గాయని సింగరాజు కళ్యాణి,డాన్స్ మాస్టర్ వై.పూర్ణచంద్ర రావు,పసుమర్తి శ్రీనివాస్,పసుమర్తి దుర్గ ప్రసాద్ ప్రసంగించారు.ఈ యువజనోత్సవాల్లో ఫాన్సీ డ్రెస్ పోటీలు,ఫోక్ డాన్సులు,భరతనాట్యం,కూచిపూడి నాట్యం,ఏకపాత్రాభినయం,వీణావాదం,మోడరన్ డాన్స్ ల్లో వాళ్ళ ప్రతిభను కనబరిచారు.విజేతలకు మేనేజర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
Спасибо