హాకీ మహిళా పోటీలు…

0
801

హాకీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్‌ కరస్పాండెంట్‌ శారదాకుమారి అన్నారు. స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయ హాకీ మహిళా పోటీలు జరిగాయి.నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్న కేయూ క్రీడాకారిణి నీరజను అభినందిస్తూ రూశ్‌వేల చెక్కును అందజేశారు. అనంతరం పోటీలను కరస్పాండెంట్‌ శారదాకుమారి ప్రారంభించి ప్రసంగించారు. ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా ప్రాంగణానికి ప్రత్యేకత ఉందన్నారు. క్రికెట్‌ దిగ్గజంఅజారుద్దీన్‌, హాకీ కెప్టెన్‌ ముకేష్‌కుమార్‌ ఇక్కడి నుంచే ఆడి జాతీయ,అంతర్జాతీయ స్తాయికి ఎదిగారన్నారు. యూనివర్సిటీ స్పోర్స్‌ ఆఫీసర్‌ ఎన్‌. శ్రీనివానరావ మాట్లాడుతూ మొట్టమొదటగా కృష్ణా యూనివర్సిటీలో మహిళా హాకీ క్రికెట్‌ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ప్రథమ స్తానంలో నిలిచిన నున్న వికాస్‌ కళాశాల జట్టుకు, ద్వితీయ స్థానంలో నిలిచిన విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాల జట్టుకు, తృతీయ స్థానంలో నిలిచిన పీబీ సిద్దార్థ జట్టుకు, నాల్లో స్థానంలో నిలిచిన కళాశాల జట్టుకు కరస్పాండెంట్‌ శారదాకుమారి బహుమతులు అందజేశారు.

Leave a Reply