రామమోహనరావు 1936, సెప్టెంబరు 6న బందరు శివార్లలోని చింతగుంటపాలెంలో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజీలో గుమాస్తాగా పనిచేసేవారు.అద్దేపల్లి రామమోహన రావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు కాకినాడ నివాసి. 1970లలో శివ సాగర్, చెరబండరాజు మరియు నగ్నముని వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగి పెద్దవాడయ్యాడు. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతినుండి ఎం.ఏ.పూర్తి చేసి బందరు హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, లెక్చరర్‌గాను పనిచేశారు. తరువాత కొంతకాలం నందిగామలో ఉద్యోగం చేసి 1972లో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం కాకినాడలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల 2016 న అస్తమించారు. ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు.
రచనలు:-
మధుజ్వాల
అంతర్జ్వాల
గోదావరి నా ప్రతిబింబం
రక్తసంధ్య
సంఘం శరణం గచ్ఛామి
మెరుపు పువ్వు
అయినాధైర్యంగానే
పొగచూరిన ఆకాశం
శ్రీశ్రీ కవితాప్రస్థానం
విమర్శ వేదిక సాహిత్య సమీక్ష
జాషువా కవితా సమీక్ష
కుందుర్తి కవిత
మినీకవిత
దృష్టిపథం
స్త్రీవాద కవిత్వం
అభ్యుదయ విప్లవ కవిత్వాలు – సిద్ధాంతాలు, శిల్పరీతులు
గీటురాయి
విలోకనం
కాలంమీద సంతకం
తెరలు
ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ
ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల
తెలుగు కవిత్వంలో ఆధునికత
అల్లూరి సీతారామరాజు (వచన కవితా కధా కావ్యం)
పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి “చిన్నప్ప” అవార్డుకు ఎంపిక అయింది. “పొగచూరిన ఆకాశం” లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించగలిగారు. అందువల్ల యిది అవార్డు కు ఎంపికయింది. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే అనేక కవితా ప్రతీకలు, పదబంధాలు, కవితాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిబద్ధ జీవితాన్ని నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవిస్తూ ఎంపిక జరిగింది.
పురస్కారాలు
2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీవిమర్శకు గాను ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రగతిశీల రచయిత చిన్నప్ప భారతి ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ఆయన రాసిన “పొగచూరిన ఆకాశం” కవితా సంపుటికి గానూ పొందారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
ఉమర్ ఆలీషా అవార్డు
సరసం అవార్డు
తిలక్ అవార్డు
ఆంధ్రసారస్వత సమితి జీవన సాఫల్య పురస్కారం
తంగిరాల అవార్డు
జాషువా అవార్డు
పులికంటి సాహితీ పురస్కారం
బోయిభీమన్న సాహితీపురస్కారం
2002లో అయినా ధైర్యంగానే పుస్తకానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
బిరుదము
“సాహితీ సంచార యోధుడు”
