సాహితీవేత్త సాంబశివరావు కు అవార్డులు… ???

0
1728

అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చండీఘర్‌ నుంచి నాలుగు పోయెట్రీ అవార్డులను సాధించినట్లు మచిలీపట్నానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పన్యారం సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తాను రాసిన కవితలకు అమెరికా ఇంటర్నేషనల్‌ పోయెట్రీ అసోసియేషన్‌, బ్రిటన్‌ ఇంటర్నేషనల్‌ పాయిట్రీ సొసైటీ, ప్రాన్స్‌ వరల్డ్‌ పోయెట్రీ సొసైటీలచేమూడు అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయసాయిలో చండీఘర్‌లో హెచ్‌ఆర్‌డీ సంస్థ నిర్వహించిన నేషనల్‌ పోయెట్రీ వర్క్‌షాపులో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కవితా రచనలో విశేష ప్రతిభ కనబరిచినందుకు నిర్వాహకులు ప్రశంసలు అందించటం తోపాటు జ్ఞాపికను అందజేసినట్లు తెలిపారు.

Leave a Reply