సదరన్ రైల్వేలో 3,585 ఖాళీలకు నోటిఫికేషన్….

0
819

ప్రస్తుత రోజులలో నిరుద్యోగుల సమస్యలు చాల ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ, కేంద్రం నుంచి చాల నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ తరుణంలో సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే (SR) భారీ సంఖ్యలో వివిధ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ పోస్టులకు అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ తెలియచేయడం జరిగింది.

ఇక పోస్టుల ఖాళీల వివరాలు ఇలా… మొత్తం ఖాళీల సంఖ్య: 3,585

పోస్టుల వారీగా ఖాళీలు..

* క్యారేజ్ వర్క్స్ (పెరంబూర్): 1208

* సెంట్రల్ వర్క్‌షాప్ (గోల్డెన్ రాక్): 723

* సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్ (పొడనూర్): 1654

ఏ పోస్టుకు ఐనా సంబంధిత అర్హత విషయానికి వస్తే 10+2 విధానంలో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ కచ్చితంగా చదివి ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) చేసి ఉండాలి అని నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనది దరఖాస్తు ఫీజు మాత్రం రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అవకాశం కూడా ఉంది. ఇక వయసు వయోపరిమితి విషయానికి వస్తే 15 – 22 సంవత్సరాల మధ్య కచ్చితంగా ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు 24 సంవత్సరాల వరకు అవకాశం కూడా ఉంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభం: 01.12.2019.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చేసుకోవడానికి చివరితేది: 31.12.2019 (సా.5.00 గం

Leave a Reply