మచిలీపట్నంకు చెందిన కమ్మిలి శ్రీరామ రాధికకు హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రా
టెక్నాలాజికల్ యూనివర్సి టీ. ఇటీవల డాక్టరేట్ ప్రధానం చేసింది. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఇమేజ్ క్లాసిఫికేషన్ బై ఇంప్రొవింగ్ స్పెటికల్ అనే అంశంపై పరిశోధన చేసి ఆ పత్రాలను ఆమె సవరించారు. దీనికి గానూ ఈమెకు పీహెచ్‌డీ పట్టా ఆ యూనివర్సిటీ ప్రధానం చేసింది. డాక్టరేట్ పొందిన శ్రీరామరాధికను కళాశాల చైర్మన్ డీజే శాస్త్రి, డీన్ కేఎస్ రావు, ప్రిన్సిపాల్ డి శ్రీనివాస, వైస్‌ప్రిన్సిపాల్ నాగజ్యోతి, డిపార్ట్‌మెంట్ హెడ్ సీఎల్ యాదవ్, టీచింగ్ అండ్ నాన్‌టీచింగ్ స్టాఫ్ తదితరులు అభినందించారు.
