స్థానికి చెమ్మనగిరిపేటలో వేంచేసివున్న గాంధీ బొమ్మ శివాలయం ఆవరణలో ఉన్న అయ్యప్ప దేవాలయంలో సోమవారం సుదర్శన హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం అగ్ని మధనంతో మొదలైన ఈ పూజ నవగ్రహ హోమం,సుబ్రహ్మణ్య హోమాలు,మహాలక్ష్మి హోమం,సుదర్శన హోమాలతో వైభవంగా నిర్వహించారు.కంభంపాటి పవన్ శర్మ ఆధ్వర్యంలో ఈ హోమాలు,పూజలు నిర్వహించారు.అనంతరం మధ్యాహ్నం వందలాదిమందికి అన్నప్రసాదం అందజేశారు.
