1184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 19 చివరి తేదీగా పేర్కొంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిన ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ డాక్టర్లకు 1, 10,000 రూపాయలు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు 53, 945 రూపాయలు వేతనంగా నిర్ణయించింది.
