వెబ్‌సైట్‌లో అబ్బుల్‌ కలాంపురస్కార విజేతల జాబితా

0
737

డాక్టర్‌ ఏపీజే అబ్బుల్‌ కలాం విద్యా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాను ఉపవిద్యాశాఖాధికారి,మండల విద్యా శాఖాధికారులకు మెయిల్‌ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీ వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ డే,ఏపీజే అబ్బుల్‌ కలాం జయంతి సందర్భంగా అబ్బుల్‌ కలాం విద్యా పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఉదయం 9గంటలకు విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పురస్కారాలకు ఎంపికైన విద్యార్దులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్నారు.

Leave a Reply