ఆంధ్రప్రదేశ్‌లో విజయ పాల ధరలు పెంచినట్లు, వాటిని శుక్రవారం నుండే అమల్లోకి తీసుకొచ్చినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ యాజ మాన్యం వెల్లడించింది. విజయ పాల ధరను నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. మరో మూడు కేటగిరీల్లో విజయ ప్రీమియం (స్టాండర్డ్), విజయ స్పెషల్ (ఫుల్ క్రీం), విజయ గోల్డ్ పాల ధరలను శుక్రవారంనాడు పెంచారు. విజయ ప్రీమియం లీటర్ పాలపై రూ.2 పెంచి రూ.52 చేయగా, ఫుల్ క్రీం పాల ధరను రూ.4 పెంచి రూ.58 చేశారు. విజయ గోల్డ్ పాల ధర ఇప్పటి వరకు లీటరు రూ.56 ఉండగా, ఇప్పుడు దానిని రూ.60కి పెంచారు.
