లాక్ డౌన్ మినహాయింపునకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు..

0
690

లాక్ డౌన్ మినహాయింపునకు ఏపీ సర్కార్  మార్గదర్శకాలు విడుదల  చేసింది.  అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ మినహాయింపులు ఉంటాయి. లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ   సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.  రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చింది. అలాగే ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషద తయారీ సంస్థలకు కూడా పరిమిత మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. సబ్బులు తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలకు కూడా మినహాయింపు ఉంటుంది. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు, ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు, అమెజానా, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు , ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Leave a Reply