రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటింటికీ మందులు సరఫరా ….

0
721

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు తనవంతు సహకరిస్తున్న రైల్వే సోమవారం నుంచి మందుల డోర్‌ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

విజయవాడ డివిజన్‌ పరిధిలోని 15 వేల మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటింటికీ మందులు సరఫరా చేయాలని నిర్ణయించింది.

వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మందులను డోర్‌ డెలివరీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

దీనికోసం మొత్తం ఆరు వాట్సాప్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.

సోమ, బుధ, శుక్రవారాల్లో 75693 05668, 76759 28721, 75693 05636 వాట్సాప్‌ నంబర్లకు,  మంగళ, గురు, శనివారాల్లో 76739 27677, 75693 05620, 70138 26171 వాట్సాప్‌ నంబర్లకు సమాచారం ఇవ్వటం ద్వారా రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు మందులను ఇంటికి ఆర్డర్‌ చేయవచ్చు.

Leave a Reply