రైతుభరోసా గడువు పెంపు……

0
711

రైతుభరోసా పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. పథకంపై అవగాహన కల్పించి అర్హులైనవారు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాలవారీగా అధికారులు ఈనెల 25వరకు గ్రామసభలు నిర్వహించారు. బుధవారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఇంకా పలువురు రైతులు మిగిలిపోవడంతో అలాంటివారంతా పథకంలో నమోదు చేసుకునేందుకు ఈనెలాఖరువరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.నిబంధనలకు అనుగుణంగా మండలంలోని చాలాగ్రామాల్లో పంట పొలాలను చెరువులుగా మార్చి చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. దీంతోపాటు సుల్తానగరం లాంటి గ్రామాల్లో పొలాలు ఇళ్ల స్థలాలుగా మారాయి. అలాంటివాటికి భరోసా పథకం వర్తించదు. దీంతోపాటు రాజ్యాంగ సంబంధిత పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు,రూ.10వేలు అంతకన్నా ఎక్కువగా పింఛను పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు,వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు ఇలా వృత్తిపరమైన నిపుణులు ఇలాంటివారికి పొలాలు ఉన్నాపథకం వర్తించదు.

Leave a Reply