శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఆదివారం లక్ష్మీ
కుబేర యజ్ఞం నిర్వహిస్తున్నట్లు శక్తి పీఠం పీఠాధిపతులు కరుమారి దాస్ స్వామీజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు స్థానిక హిందూ కళాశాల ఆవరణలో ఈ హోమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేయాని స్వామీజీ కోరారు.
