రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.సమాధానంగా భారత్, ఓపెనర్ల వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.43 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 85 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.హిట్ మ్యాన్ టీ20ల్లో మూడోసారి వేగంగా 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత సాధించాడు.