అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు.
సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరణ.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు.
రాజధాని పరిధిలో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను సిద్దం చేసిన ప్రభుత్వం.
నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లో అందరికీ ఇళ్ల పథకం భూమిని సిద్దం చేసుకున్న సర్కార్.
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల పరిధిలోని పేదలకు రాజధానిలో ఇళ్ల కేటాయింపు.
తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని పలు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కేటాయింపు జరపాలని గతంలోనే నిర్ణయం.
ఇప్పటికే రాజధానిలో ఇళ్ల కేటాయింపుపై జారీ చేసిన జీవో 107ను రద్దు చేసిన హైకోర్టు.
పేదలకు ఇళ్ల పథకం కోసం గుర్తించిన భూమిని రెవెన్యూ అప్పగించేలా ఉత్తర్వులు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్టు జీవోలో వెల్లడి.
.
