రంజీ మ్యాచ్ ను నిలిపేసిన పాము..మైదానంలో చక్కర్లు….

0
768

మైదానంలోకి పాము రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయిన అరుదైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా, విదర్భ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. సడన్‌గా మైదానంలోకి పాము దూసుకొచ్చింది. దీంతో.. ఫీల్డింగ్ చేస్తున్న విదర్భ క్రికెటర్లు మైదానంలో పరుగులు తీశారు. మైదానంలోకి పాము రావడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన గ్రౌండ్ సిబ్బంది దాన్ని వెలుపలకి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో.. కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. తాజాగా పాము గ్రౌండ్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులు కామెడీగా స్పందిస్తున్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ టీమ్ కెప్టెన్ ఫజల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆంధ్రా జట్టు 32 ఓవర్లు ముగిసే సమయానికి 87/3తో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హనుమ విహారి (43 నాటౌట్), వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (13నాటౌట్) ఉండగా.. ఓపెనర్లు గణేశ్వర్ (8), ప్రశాంత్ కుమార్ (10) నిరాశపరిచారు. వీరి తర్వాత వచ్చిన రికీ భుయ్ (9) కూడా పేలవంగా వికెట్ చేజార్చుకున్నా.. అనంతరం వచ్చిన హనుమ విహారి నిలకడగా ఆడుతున్నాడు.

Leave a Reply