యువకుల నిజాయితీ

0
746

తమకు దోరికీన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అందజేసి యువకులు తమ నిజాయితీని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. పామర్రు సమీపంలోని నిడుమోలు గ్రామాలకు చెందిన సుధాకర్‌, మోహన్‌లు స్నేహితులు.వీరు షాపింగ్‌ చేసేందుకు బుధవారం మచిలీపట్నం వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నగరంలోని ఆర్‌కే ప్యారడైజ్‌కు వచ్చారు. భోజనం చేసి తిరిగి వస్తుండగా హోటల్‌ సమీపంలో వారికి ఓ బంగారు మణికట్టు గొలుసు దొరికింది. దీంతో ఎవరిదైనా బంగారు వస్తువు పోయిందా అంటూ అక్కడున్న వారిని ఆరా తీశారు.వారంతా తమది కాదని చెప్పడంతో చిలకలపూడి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. బ్రాస్‌లెట్‌ దొరికిన విషయాన్ని ఎస్‌ఐ శివరామకృష్ణకు వివరించి వస్తువును అప్పగించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ నిజాయితీగా బంగారు వస్తువును అప్పగించినందుకు యువకులను అభినందించారు.తమ సిబ్బంది సహాయంతో, సీసీ కెమెరాల అధారంగా విచారణ చేసి బ్రాస్‌లెట్‌ పోగొట్టుకున్న వ్యక్తికి అందజేస్తామని చెప్పారు. వస్తువు పోగొట్బకున్న వారు ఉంటే పూర్తి వివరాలతో స్టేషన్‌కు రావాలని ఎస్‌ఐ కోరారు.

Leave a Reply