మొబైల్‌ వాలెట్లతో జాగ్రత్త….అన్ని బ్యాంకు ఖాతాలు లింక్‌ చేయొద్దని ప్రజలకు పోలీసు అధికారుల సూచనలు…..

0
753

పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి మొబైల్‌ వాలెట్లను ఉపయోగించుకొని కొందరు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ శాఖ సూచించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోలీసు ఉన్నతాధికారులు పలుసూచనలు చేశారు. మొబైల్‌ వాలెట్‌కు ఎట్టి పరిస్టితుల్లోనూ అన్ని బ్యాంకు ఖాతాలు లింక్‌ చేయవద్దని, పూర్తిగా ఉపయోగించడం తెలుసుకున్న తర్వాతే ఆర్దిక లావాదేవీలు జరపాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డ వారు పోలీస్‌ సాయం కోసం www.iamcheated.com వెబ్‌సైట్‌ను లేదా సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా వెళ్లి సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply