ఎంఎస్ గురుక్కకడత్తనాదన్ కలరీ అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన ఆర్ట్ పోటీల్లో బందరుకు చెందిన గేదెల జోషిత్ ప్రథమ బహుమతిగా స్వర్ణ పతకాన్ని సాధించాడు. జట్టు పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతిగా వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రముఖ మైక్రో చిత్రకారుడు గేదెల అప్పారావు మనుమడైన గేదెల జోషిత్ బాల్యం నుంచి గింజలపై మైక్రో చిత్రాలు గీయడం అలవాటు చేసుకున్నాడు. ఇలా జోషిత్ గింజలపై చిత్రీకరించిన వెంకటేశ్వర స్వామివారి చిత్రాలకు బహుమతి లభించింది.

