మే 3 తర్వాత కూడా రైళ్లు, విమానాలు పూర్తి స్థాయిలో సేవలు అందించే అవకా శాలు లేవు..

0
701

మే 3 తర్వాత కూడా రైళ్లు, విమానాలు పూర్తి స్థాయిలో సేవలు అందించే అవకా శాలు లేవు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే ప్రయాణ సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలకు కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోనే అనుమతించే అవకాశం ఉందని  అధికార వర్గాలు చెబుతున్నాయి.  ఒకవేళ లాక్ డౌన్ ముగిసినప్పటికీ ప్రయాణాల్లో మాస్క్ లు తప్పనిసరిగా వాడే విధంగా  నిబంధనను తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారికి ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారి చేస్తుందని చెబుతున్నారు. అయితే, వివాహాలు, మత సంబంధ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

Leave a Reply