మహేంద్రసింగ్‌ ధోనికి అరుదైన గౌరవం

0
781

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వన్డే టీమ్‌ ఆఫ్‌ దడికేడ్‌ కెప్టెన్‌గా మహీ ఎన్నికయ్యాడు. టీమిండియాకు ఎన్నో విస్మరించలేని విజయాలను అందించిన ధోనీని టీ20 కప్‌, 2011 ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీని అదించిన అతడికి ఈ దశాబ్దపు కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ జాబితాలో ధోనీతోపాటు భారత సారథి విరాట్‌ కోహ్లీ, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు కూడా చోటు దక్కింది. ఈ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ధోని సేవలను కొనియాడింది. ధోనీ కాలం టీమిండియాకు గోల్డెన్‌ పీరియడ్‌గా వర్ణించారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును విజయ తీరాలకు చేర్చిన అతడి ఘనత చిరస్మరణీయమని ఆకాశానికి ఎత్తింది. వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓడిపోయిన తర్వాత ధోని మళ్లీ ఆడలేదు. అయితే ఆ జట్టును కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని ఎన్నిక చేసింది.

Leave a Reply