మచిలీపట్నం నోబుల్ పాఠశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారి గురించి ఆసక్తికర విషయాలు….

0
1409

ఎందరో మహామహులు చదివిన మహోన్నత విద్యాకుసుమం నోబుల్ కళాశాలకు స్థాపకులైన రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో “ప్రెస్బ” అనే గ్రామంలో ఒక చర్చలో బోధకునిగా వున్న జాన్ నోబుల్ పుత్రుడు.1810 ఫిబ్రవరి 9 న జన్మించారు రాబర్ట్ టర్లింగ్టన్ .ప్రాధమిక విద్య ముగిసిన తరువాత సిడ్నీ సెస్సెక్స్ లో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.1836 లో కృష్ణ జిల్లా కలెక్టరుగా పనిచేసిన గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత,మూఢనమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని ఇండియాకు పంపవలసిందిగా ఇంగ్లండ్లో వున్నా తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు.ఈ విజ్ఞప్తిని స్వీకరించినవారిలో రాబర్ట్ టర్లింగ్టన్ ఒకరు కాగా రెండొవ బి.డబ్లు.ఫాక్స్.నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే..ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ గురు పట్టా ఉండాలని షరతు పెట్టారు.దాంతో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ తమ గ్రామ సమీపంలో వున్న ఓల్డ్ దోల్చ్ చర్చి లో సహాయ గురువుగా ఏడాది మతగురువుగా కొంతకలం పని చేసి గురు పట్టా పొందారు.తన మిత్రుడు బి.డబ్లు.ఫాక్స్ తో కలిసి 1841 ,మార్చ్ 3 వ తేదీ ఇంగ్లాండ్ నుండి ఓడలో బయల్దేరి 1841 జులై 4 వ తేదీన మద్రాస్ చేరుకున్నారు.రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ 2 నెలలు అక్కడ ఒక ఆంధ్రుడికి జీతమిచ్చి తన దగ్గర తెలుగు భాషను నేర్చుకున్నారు.ఆ తరువాత అయన రహదారులపై ప్రయాణించి గుంటూరు చేరుకొని తనను ఆహ్వానించిన గోల్డింగ్ హమ్ ను కలుసుకున్నారు.గోల్డింగ్ హమ్ కృష్ణ,గుంటూరు జిల్లాలకు కలెక్టర్ గా ఉండేవారు.గుంటూరులో పాఠశాలను స్థాపించమని అయన రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ను కోరారు.అయన అందుకుని తిరస్కరించారు.ఎందుకనగా ముందుగా తీరప్రాంతంలో ఉన్న నిరక్షరాస్యులకు చదువు చెప్పాలన్న ఆలోచనతో అక్టోబర్ లో బందరు చేరుకున్నారు.బందరులో ఉన్న మేజర్ అద్రి ఇంటిలో అతిధిగా ఉండి తన కార్యాచరణ మొదలు పెట్టారు.దాదాపు 20 నెలల తరువాత 1843 జులై 5 తేదీన గార్డెన్ అనే ఆంగ్లేయాధికారి సహాయంతో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గుర్రం మీద ప్రయాణించి తిరిగి మద్రాస్ చేరుకున్నారు.అక్కడ తెలుగు భాషా పటిమను రాత పరీక్షను మాట్లాడటంలో పరీక్ష పద్దతిని పూర్తి చేయాల్సివచ్చింది.మద్రాస్ లో అప్పటి ఐసీఎస్ అధికారులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ భాష పాండిత్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించి ఉతీర్ణుడిని చేశారు.తిరుగు ప్రయాణంలో మరో విద్యాధికుడైన షార్కీని వెంటబెట్టుకుని వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విశిష్టమైన రోజు 1843 నవంబర్ 21 వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయం విద్య వైజ్ఞానిక రంగం పునాదిపడిన రోజుగా చెప్పాలి. నోబుల్ విద్యా సంస్థ స్థాపితమైన శుభదినం రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్,తన సహచర మిత్రుడైన షార్క్,పాంచాల రత్నం,అయినాల నాగభూషణం అనే ఇద్దరు విద్యార్థులతో తెలుగు గడ్డపై ఆంగ్ల పాఠశాల “ది నేటివ్ ఇంగ్లీష్ స్కూల్ “అనే పేరుతో ప్రారంభమైన నోబుల్ విద్యా సంస్థ..తొలి పాఠం బైబిల్ గ్రంథంలోని ఒక అధ్యాయం మలి పాఠం భగవత్గీత లోని కొన్ని శ్లోకాలతో నోబుల్ గారి నోటినుండి వెలువడేవి.క్రమేపి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండేది.విదేశీయుడైనప్పటికీ ఆయన నోటి నుండి వెలువడే తెలుగు పాదాలను వింటున్న విద్యార్థులను వివశులను చేసేవి.రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ క్రమశిక్షణా విధానం విద్యార్థులకు ఆదర్శం.ఆయన పట్ల విద్యార్థులు ఎనలేని ఆత్మీయతను ప్రదర్శించేవారు.ఇంత చేస్తున్న తన ఫోటో అనేది లేకుండా ఆయన జాగ్రత్త వహించేవారు.ఆఖరికి పెయింటింగులలో సైతం తన చిత్రాన్ని రూపొందించరాదని కోరేవారు.అందుకే నేటికీ ఆయన హృదయాన్ని తప్ప రూపాన్ని దర్శించే భాగ్యం తరువాతి తరాలవారికి దక్కలేదు.అయన జీవితమంతా కఠిన బ్రహ్మచర్య దీక్షతోనే గడిపారు.1864 సంవత్సరంలో ఆ పాఠశాల రెండొవ స్రెణి (Intermediate)బోధించే కళాశాలగా మారింది.అదే ఏడాది నవంబర్ 1 వ తేదీన బందరుకు పెద్ద ఉప్పెన వచ్చింది.55 వేలమంది ఉన్న నాటి జనాభాలో 30 వేలమంది పైగా ప్రాణాలు కోల్పోయారు.ఆ ఉప్పెన వలన వాతావరణం కలుషితమైపోయింది.ఊరంతా జ్వరాలు,విరేచనాలతో ప్రాణాలతో బైటపడినవారు బాధపడ్డారు.అదే సమయంలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.స్థలమార్పునకు కొద్దికాలం ఇంగ్లాండుకు వెళ్ళవలసిందిగా ఆయనకు మిత్రులు సూచించారు.కానీ ఆ సూచనలను అయన అంగీకరించలేదు.ఆరోగ్యం మరింత క్షీణించడంతో 1865 అక్టోబర్ 17 వ తేదీన అయన బందరులో తనువు చాలించారు.అయన ఎప్పుడు చనిపోయారో కూడా అయన దగ్గర ఉన్నవారు గుర్తించలేదు.
ఆ తరువాత ఒక హాల్ నిర్మాణం చేసి దానికి రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ పేరు పెట్టారు.పాఠశాలను,కళాశాలను నోబుల్ పేరు పిలవసాగారు.1893 లో మొదటి తరగతిగా మారింది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక మహిళా పట్టభద్రురాలు నోబుల్ కళాశాల నుండే పట్టా తీసుకోవడం విశేషం ఆమే మంచాల కృష్ణమ్మ.అలాగే ఎం.ఏ డిగ్రీని అందుకున్నవారు వెలగపూడి సుందర రామయ్య.ఆయన నోబుల్ కళాశాలలో బి.ఏ.డిగ్రీ చదివి ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ డిగ్రీని సంపాదించారు.1918 లో నోబుల్ కళాశాల ప్లాటినం జూబిలీ జరుపుకుంది.చార్లెస్ త్ర్వారియాన్ అనే ఇంగ్లాండ్ విద్యావేత్త నోబుల్ కళాశాలని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అని అభివర్ణించారు.ఎందరో మహానుభావులు ఇక్కడ చదువుకున్నారు.
1880 సంవత్సరంలో ముగ్గురు ప్రఖ్యాత వ్యక్తులు బండారుకు ప్రత్యేక ప్రాముఖ్యత తీసుకువచ్చారు.వారే శ్రీ కొంపల్లి హనుమంత రావు,శ్రీ ముట్నూరి కృష్ణారావు,శ్రీ భోగరాజు పట్టాభిరామయ్యలు.వీరి విద్యాభ్యాసం నోబుల్ కళాశాలలో జరగటం గమనార్హం.అలాగే ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు,శ్రీ విశ్వనాథ సత్యనారాయణ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి,అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వందలాదిమంది ప్రముఖులు నోబుల్ కళాశాల నుండి ఉద్భవించిన ఆణిముత్యాలే.

గూగుల్ రికార్డ్స్ లో దొరికిన ఫోటోలు కొన్ని మీకు షేర్ చేస్తున్నాము

Leave a Reply