జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమిత్ విశ్వాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.రూ. 825 కోట్ల వ్యయంతో ఈ మెడికల్ కళాశాల నిర్మించనుండగా కేంద్ర ప్రభుత్వం రూ. 1185 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు తమ వాటాగా ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల మంజూరు మూడో దశలో భాగంగా వైద్య కళాశాలను నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు.
