బందరు వాసులకు బంగారు పతకాలు…

0
750

నెల్లూజిల్లా కావలిలో ఈనెల 14, 15 తేదీల్లో జరిగిన 88వ మాస్టర్‌ అథ్లెటిక్‌
చాంపియషిప్‌ – 2018 లో బందరు వాసులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 40 + విభాగంలో వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ మత్తి. అరుణ 100 మీటర్లు,200 మీటర్లు లాంగ్‌జంప్‌, 4 – 400, 4- 400 మీటర్ల పరుగుపందెంలో ఐదు బంగారు పతకాలను దక్కించుకున్నారు. బందరుకు చెందిన గృహిణి రిజ్వాన “హైజంప్‌, ట్రిపుల్‌ జంప్‌ విభాగాల్లో బంగారు పతకాలను సాధించారు. 100 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకాన్ని ఆమె గెలుచుకున్నారు. 4.100, 4- 400 మీటర్ల పరుగుపందేల్లో బంగారు పతకాలను ఆమె గెలుచుకున్నారు. 40 + విభాగం లో బంగారు పతకాలు గెలుచుకున్న మహిళలను సోమవారం జేసీ కెమాధవీలత తన చాంబరులో అభినందించారు. వీరిద్దరూ ఫిబ్రవరి 5 నుంచి వతేదీవరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి మాన్టర్‌ అథ్లెటిక్‌ చాంపియషిప్‌-2020 పోటీల్లో పొల్గొననున్నారు. అభినందన కార్యక్రమంలో జేసీతో పాటు డీఈవో ఎంవీ. రాజ్యలక్ష్మి, సర్వశిక్షా అభియాన్‌ పీడీ కేడీవీఎం ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


పరుగుల గాంధీకి స్వర్ణ పతకాలు 89వ మాస్టర్‌ అథ్లెటిక్‌ చాంపియషిప్‌ 2019లో +40 విభాగంలో బందరుకు చెందిన నరహరిశెట్టీ మోహన్‌ దాస్‌ కరంచంద్‌గాంధీ(పరుగుల గాంటి రెండు
బంగారు పతకాలు, వెండి పతకాన్ని గెలుచుకున్నారు.1500 మీటర్ల పరుగుపందెం, 5000 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలను ఆయన గెలుచుకోగా,800 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు.

Leave a Reply