మైసూర్ దత్తపీఠంలో గురువారం వరకు నిర్వహించిన భగవద్గీత పోటీల్లో బందరు వాసులు బంగారు పతకాలు అందుకుని తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొనగా నగరానికి చెందిన కె. పావని,ఆమె కుమారులు వరుణ్, వంశీరఘురామ్‌లు బంగారుపతకాలు దక్కించుకున్నారు. గణపతి సచ్చిదానందస్వామీజీ సమక్షంలో గీతాశోకాలు ఆలపించి ఆయన ఆశీస్సులు అందుకున్నట్లు మచిలీపట్నం దత్తాశ్రమ నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనివాస్, బుద్దేశ్వరరావు, గాంధీ,ప్రసాదు, శ్యామలతోపాటు డా. ధన్వంతరి ఆచార్య సవరం వెంకటేశ్వరరావులు వారిని అభినందించి మరిన్ని పతకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
