బందరు లేడీ యాంప్తిల్‌ కళాశాలకు ప్రతిభ అవార్డులు..

0
658

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ పురస్కార అవార్డులకు బందరు లేడీ యాంప్తిల్‌ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్ధులు ఎంపికయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో జిల్లాకు తొమ్మిది ప్రతిభ అవార్డులు లభించగా, ఇందులో ఎనిమిది బందరులోని లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు దక్కాయి. కళాశాలకు చెందిన వక్కలగడ్డ శ్రీ, మారుబోయిన నాగనీరజ, మూరకొండ సుజాత, జంపాన పద్మజ,అరిఫ్‌ భేగం, శానాపతి అనూష, మొవ్వ అనూష, మోపిదేవి నాగశ్రీ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్‌ రాకేష్‌ కుమార్‌,అధ్యాపకులు హరిబాబు, మున్వర్‌, రాంబాబు, టీవీఎస్‌ఎన్‌ రావు, హిరణ్మయి తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply