బందరు డివిజన్‌లో 2.22 లక్షల మంది కార్డుదారులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నట్లు ఆర్షీవో ఖాజావలి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీవో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. రేషన్ షాపుల వద్ద షామియానాలు, తాగునీరు వంటి వసతులు కల్పించినట్లు తెలిపారు. లంక గ్రామాలకు పడవల ద్వారా సరుకులను తీనుకువెళుతున్నట్లు ఆయన తెలిపారు. మచిలీపట్నంలో విదేశాలనుంచి వచ్చిన వారు 120 మంది ఉన్నా రని వీరిలో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించామన్నారు.
ఒకరికి నెగిటివ్ రిపోర్డు వచ్చిందని, మరొకరి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో 18 పడక లను ఐసోలేషన్ చేయించామన్నారు. వరలక్ష్మీ పాలిటెక్నిక్ కళాశాలలో100 పడకలు సిద్దం చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుంచి 1
గంట వరకు భౌతిక దూరం పాటించి వ్యవసాయ పనులు చేసుకోవచ్చన్నారు.
