అది జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్. అక్కడ పుస్తకాలు చదువుకోవచ్చు… ఆటలూ ఆడుకోవచ్చు.
ఇష్టమైన సంగీత పరికరం తెచ్చుకుని శ్రతి చేయొచ్చు. పిచ్చాపాటీ కబుర్లూ చెప్పుకోవచ్చు. ఏ
విషయంపైనైనా చర్చలూ పెట్టుకోవచ్చు. అంతేనా! అప్పుడప్పుడూ చిన్నారులు చేసే లైవ్ మ్యూజిక్ విన్యాసంలో తరించనూవచ్చు. ఈ కాఫీషావ్ ఇంత భిన్నంగా ఉండటం వెనుక ఉన్న నిర్వాణ నిర్వాహకురాలు భాగీ శ్రావణి గురించి చెప్పాలి. ఆ వివరాలను ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే…
అతి నిర్వాణ కాఫీ షాప్ లోపలికెళ్తూనే అరుగులు పలకరిస్తాయి. గోడమీద రాతలు, పుస్తకాలూ చూడొచ్చు.ఎదురుగా ఎనర్జీవాల్.. కింద కూర్చునేందుకు పరుపులు, సిమెంటు వేయని ఇటుక గోడ.. చూస్తే నగరంలో పల్లె పరిమళం. ‘సాధారణ వాతావరణంలో ఈ పాజిటివ్ వైబ్ సృష్టించా. ఇందుకు ఆధ్యాత్మికత కారణం. ఈ థీమ్, ఆర్ట్‌వర్క్ మా దగ్గరికొచ్చే వినియోగదారులే చేశారు.” అని అంటుంది శ్రావణి.
రోజుల్లో ఐయామ్ డిప్రెన్ట్ ఐ యామ్ యాంగెటీ… అని చెప్పుకోవటం ఓ ఫ్యాషన్‌గా మారింది.
అలాంటివాళ్లు ఇక్కడికొస్తుంటారు. కొత్తవ్యక్తులతో కలిని మాట్లాడుతుంటారు. వారిని ఎత్తిచూపే వాళ్లెవరూ ఉండరిక్కడ. అభిప్రాయాల్ని పంచుకునేవాళ్లే వస్తారు. దాంతో వారికి కొత్త ప్రపంచం పరిచయమవుతుంది.ఒత్తిడికి దూరమవుతారు. ఆత్మహత్యా ప్రయత్నం ఆలోచనలు చేసిన ఇద్దరు ఇక్కడికి వచ్చాకే మనసు మార్చుకున్నారట. మా కాఫీషావ్‌కి గాయకులు, రచయితలు, సంగీతాభిమానులు తరచూ వస్తుంటారు.శనివారం ‘ఓపెన్ జామ్’ కాన్సెన్ట్స్ ఉంటుంది. నేను సితార వాయిస్తా. ఇలా ఎవరి వాద్య పరికరం వాళ్లు తెచ్చుకుంటారు. తప్పొప్పులున్నా సరే అంతా కలిని నేర్చుకుని వాయిస్తారు. ఆలోచనల్ని పంచుకుంటారు.కొందరికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. దాన్నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారో నషేపే చర్చా… అనే కార్యక్రమం ద్వారా అందరికీ చెబుతారు. స్పూర్తి నింపుతారు. ఇక మా నిర్వాణలో ఓపెన్‌మ్రైక్ ఉంది. ఎంపిక చేసినవాళ్లు అక్కడ కవిత్వం చెబుతారు. పాటలు పాడుతుంటారు. కామెడీ చేస్తారు. కొత్తవాళ్ల మధ్య బృందచర్చలూ ఉంటాయి. యోగా వర్క్‌షావ్‌లు నిర్వహించాం. నిర్వాణలో ప్రత్యేకంగా నిలిచిందేంటంటే..పిల్లలు నిర్వహించే ‘విక్‌బ్యాండ్‌ని ప్రోత్సహించటం. ప్రతి నెల ఓ శుక్రవారం ఈ బ్యాండ్ ఇక్కడ సంగీతంతో హుషాంెత్తిస్తుంది.
అలా చేయాలన్నదే నా కల.. ఆమె మాటల్లో
మా స్వస్థలం బందరు. పుట్టి పెరిగిందంతా ‘ప్లైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్ చదివాక ఐటీలో సేల్స్ విభాగంలో పనిచేశా. ఏడాదిన్నర కిందట ఉద్యోగం వద్దనుకుని వారణాసి వెళ్లా. ఎక్కడికళ్లినా మనుషులతో కలవటం… వారి ఆనందాల్ని పంచుకోవటం… వారి బాధల్ని వినటం నాకో అలవాటు. ఆ ప్రయాణంలో కొత్తవాళ్లతో “పరిచయం అయ్యింది. అప్పటివరకూ నాలో లేని దైవభక్తి అంకురించిందప్పుడే. ఉద్యోగం కంటే పదిమందిని “కలిపే ప్రయత్నం చేయాలనుకునే ‘నిర్వాణ’ స్రారంభించా. ఆహారం, వివిధ కార్యక్రమాలతో జనాలను కనెక్ట్ చేయాలని నిర్ణయించుకుని ఇటొచ్చా. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. ఒప్పించా. వ్యక్తిగతంగా ఇబ్బందులొచ్చినా అధిగమించా. ప్రస్తుతం నా పని నాకు ఆనందాన్నిస్తోంది. ఫొటోగ్రాఫర్, మ్యుజీషియన్, సింగర్, పెయింటర్…ఇలా వివిధ రంగాలకు చెందిన అందరినీ ఒకచోట కలుసుకునేలా చేశా. ఒకరి అవసరం మరొకరికి వచ్చిసాయం చేసుకుంటున్నారిప్పుడు. ప్రతి మనిషి అనుభవాలు గొప్పవే అనే సిద్ధాంతం నాది. నిర్వాణకి వచ్చిన వారిలో… విభిన్నంగా ఉండే 50 మంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేని సోషల్‌మీడియాలో షేర్ చేశా. దీనికి ‘హ్యూమన్స్ ఆఫ్ నిర్వాణ’ అనే పేరు పెట్టా. త్వరలోనే మెడిటేషన్ వర్క్‌షావ్స్, యోగా రీట్రీట్స్ చేయబోతున్నా. నిర్వాణ అంటే మోక్షం అనే అర్థం వస్తుంది. నా జీవితంలో వీలైనంతమందిని కలిపితేనే లభించినట్లు ఫీలవుతా. నిర్వాణను దేశంలోని నాలుగైదు నగరాల్లో వ్యాప్తి చేయాలనేదే నా లక్ష్యం.”
